ఆ ప్రముఖ సంస్థ నుంచి ఒకేసారి 120 మంది ఉద్యోగులు ఔట్.. షాకింగ్ కారణం ఇదే! ప్రముఖ ఫిజిక్స్ వల్లాహ్ సంస్థ ఒకేసారి120 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఈ ఏడాది వర్క్‌ఫోర్స్‌లో 0.8 శాతం కంటే తక్కువ పనితీరు కనబరిచిన వారిని ఇంటికి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఖర్చు తగ్గించుకోవడానికే ఇలాంటి పనులు చేశారంటూ బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. By srinivas 20 Nov 2023 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Physics Wallah : ప్రముఖ ఫిజిక్స్ వల్లాహ్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో జాబ్ చేసే ఉద్యోగుల పనితీరు నచ్చక ఒకేసారి వందకుపైగా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. నీట్(NEET), జేఈఈ(JEE)లకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థగా పేరుగాంచిన ఫిజిక్స్ వల్లాహ్ తీసుకున్న ఈ సంచలనం నిర్ణయం నెటిజన్లకు షాక్ కు గురిచేసింది. ఈ మేరకు తమ సంస్థలో పనిచేసే ఎంప్లాయిస్.. 0.8 శాతం కంటే తక్కువ పని తీరు కనబరిచారనే కారణంగా విధుల నుంచి వారిని తొలగించినట్లు సంస్థ అధికారులు తెలిపారు. కంటెంట్, ఆపరేషన్ తో పాటు పలు విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగించినట్లు వెల్లడించారు. 'మేము మిడ్-టర్మ్, ఎండ్-టర్మ్ సైకిల్స్ ద్వారా పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేస్తాం. అక్టోబర్ ముగిసే నాటికి మా వర్క్‌ఫోర్స్‌లో 0.8 శాతం కంటే తక్కువ పనితీరు కనబరిచిన 70 నుంచి 120 మంది వ్యక్తులను ఇంటిరి పంపించాం. మా దృష్టి అంతా డైనమిక్ గా పని చేసే బృందాన్ని పెంపొందించడంపై ఉంది. రాబోయే ఆరు నెలల్లో వెయ్యి మంది ఉద్యోగుల్ని నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నాం' అని ఫిజిక్స్ వల్లాహ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) సతీష్ ఖేంగ్రే వెల్లడించారు. అయితే దీనిపై స్పందిస్తున్న బాధిత ఉద్యోగులు ఖర్చు తగ్గించుకోవలనే ప్రయత్నంలోనే కంపెనీ ఇలాంటి పనులు చేస్తుందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తమను ఫెయిల్యూర్ గా చూపిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. Also read :ఏపీలో 1,896 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటినుంచే అప్లికేషన్ ఇదిలా ఉంటే.. కొవిడ్ కాలంలో ఆన్‌లైన్ తరగతులకు పెరిగిన ఆకస్మిక డిమాండ్ ను అందిపుచ్చుకోవడానికి బైజూస్ (Byju's), అన్ అకాడమీ(Un Academy), ఎడ్ టెక్(Edtech) కంపెనీలు అదనపు సిబ్బందిని నియమించుకున్నాయి. ఫిజిక్స్ వల్లాహ్ కూడా అదే బాటలో నడిచింది. ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో దీని ప్రధాన కార్యాలయం ఉండగా.. 2020లో యూట్యూబ్ లో ఆన్ లైన్ తరగతులు తీసుకునేవారి కోసం అలఖ్ పాండే, ప్రతీక్ మహేశ్వరి ప్రారంభించారు. ఇక స్కూల్ దశ నుంచే విద్యార్థులకు నీట్, జేఈఈలలో అత్యుత్తమ ప్రమాణాలతో విద్యనందిస్తూ అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు ఈ కంపెనీలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులున్నారు. #physics-wallah #120-employees #out మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి