Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులలో మరో కీచక టీచర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులతో ఉపాధ్యాయుడు రామ్‌దాస్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినిలు కంప్లైంట్ చేశారు. ఫిజిక్స్ టీచర్ రామ్‌దాస్ తమ శరీరంలోని ప్రైవేట్ భాగాలను తడుముతున్నాడంటూ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడు రామ్‌దాస్ కు దేహశుద్ధి చేశారు.
ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ఆందోళన మేరకు పాఠశాలకు చేరుకున్న పోలీసులు రామ్‌దాస్ అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఉపాధ్యాయుడు రామ్‌దాస్ లైంగిక వేధింపుల ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై గిరిజన విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. రామ్‌దాస్ ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.