Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్ A1.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ వ్యవరంలో A1గా కేసీఆర్ పేరును చేర్చాలని అన్నారు. ఈ కేసులో హరీష్ రావు, సంతోష్ రావు, మాజీ ఐఏఎస్ అధికారి వెంకటరామిరెడ్డిని విచారించాలని డిమాండ్ చేశారు.

New Update
Raghunandan Rao: కేసీఆర్ అంటేనే అంతం... రఘునందన్ రావు విమర్శలు

Raghunandan Rao: తెలంగాణలో సంచలంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను కూడా ఒక బాదితుడినే అని అన్నారు బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక ఉప ఎన్నిక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన డీఎస్పీ చెప్పారని మీడియా లో వచ్చిందని.. అప్పుడే డీజీపీ కి ఫిర్యాదు చేశానని అన్నారు. నా ఫోన్, నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పిన అదే నిజమైందని పేర్కొన్నారు.

ALSO READ: ఢిల్లీకి సీఎం రేవంత్.. తుది జాబితా విడుదల

కేసీఆర్ మొదటి ముద్దాయి...

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి అప్పటి కలెక్టర్ వెంకటరమిరెడ్డి అని అన్నారు. ఇప్పటికైనా నిస్పక్ష పాత విచారణ చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డిని, చీఫ్ జస్టిస్ ని కోరారు. బేగంపేట్ లో కోటి రూపాయల పట్టుకున్న కేసులో అధికార పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా ముద్దాయిగా ఉన్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి, వివేక్ లు కూడా ఫిర్యాదు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

ముగ్గురిపై విచారణ జరపాలి..

అప్పటి డీజీపీ, అప్పటి పరికరం కొన్న డీఎస్పీ, ఒక పీఏ ఎవరు? అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్, సంతోష్ రావు అనే వీళ్ళను విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీష్, వెంకట రామి రెడ్డిల మీద ప్రత్యేక FIR పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ముద్దాయిలను అరెస్ట్ చేస్తారని నమ్ముతున్నానని అన్నారు. కోర్టు జస్టిస్ ల ఫోన్ లు కూడా విన్నారని చంద్రబాబు కూడా చెప్పారని గుర్తు చేశారు. తెలుగు మాట్లాడే జస్టిస్ లు ఇవాళ హైదరాబాద్ వస్తోన్న సీజేఐకి ఫిర్యాదు చెయ్యాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు