Ex DSP Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో పోలీస్ అధికారులు గుర్తించారు. By V.J Reddy 23 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ex DSP Praneeth Rao : మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు(Ex. DSP Praneeth Rao) ఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు(Bhujanga Rao) ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణకు పిలిచి ప్రశ్నించి ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇంటలిజెన్స్ పొలిటికల్ వింగ్(Intelligence Political Wing) లో అదనపు ఎస్పీగా భుజంగరావు పనిచేశారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో పోలీస్ అధికారులు గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు అయింది. పంజాగుట్ట పీఎస్‌లో SIB అధికారులు ప్రణీత్‌రావుపై ఫిర్యాదు చేశారు. SIB మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు సహకరించిన మరికొందరు అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ప్రణీత్‌రావు మీద IPC 409, 427, 201, 120(బీ), PDPPయాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. Also Read : 10 ఏళ్లలో ఏపీని నాశనం చేశారు.. చంద్రబాబు, జగన్‌పై షర్మిల ఫైర్ అసలేం జరిగింది.. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేశారనే ఆరోపణలు ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్(Revanth Sarkar). అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. #phone-tapping-case #telangana-latest-news #ex-dsp-praneeth-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి