Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాధాకిషన్ రావుకు రిమాండ్‌

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించింది నాంపల్లి కోర్టు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతిరావులకు కోర్టు ఐదు రోజుల పోలీసుల కస్టడీ అనుమతించిన విషయం తెలిసిందే.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాధాకిషన్ రావుకు రిమాండ్‌
New Update

Phone Tapping Case: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ను (Former DCP Radha Kishan Rao) అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.దాదాపు 16 గంటల పాటు విచారించిన పోలీసులు.. పలు కీలక విషయాలు బయటపెట్టారు. ఈరోజు రాధాకిషన్ ను విచారించేందుకు కస్టడీ కోరుతూ పోలీసులం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషన్ ను విచారించిన ధర్మాసనం రాధాకిషన్‌ రావుకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్‌ విధించింది.

ఐదు రోజుల కస్టడీ..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీల కస్టడీపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను కొట్టేసింది. భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. ప్రణీత్ రావును సైతం ఐదు రోజులపాటు కస్టడీకి కోరిన పోలీసులు.. ప్రణీత్‌రావు జుడీషియల్ రిమాండ్ పూర్తి కావడంతో కస్టడీని నాంపల్లి కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం చంచల్‌గూడా జైల్లో ఈ ముగ్గురు నిందితులు ఉన్నారు.

ప్రభాకర్ రావు కొరకు లుక్ అవుట్ నోటీసులు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు కొరకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీస్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యహారం బయపడడంతో ఆయన ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ నేతృత్వంలోనే ఈ ఫోన్స్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని పోలీస్ విచారణలో తేలింది. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు ను ఏ1 గా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

Also Read: తెలంగాణ వాసులకు అలెర్ట్…ఏప్రిల్ 1 నుంచి జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..!

#phone-tapping-case #radhakishan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe