సర్పంచ్ నవ్య లైంగిక వేధింపుల ఆరోపణల్లో కీలకమైన ఫోన్ రికార్డులు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో కీలకమైన ఫోన్ కాల్ రికార్డులు లభ్యమయ్యాయి. By Vijaya Nimma 27 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఈ ఫోన్ కాల్ రికార్డులో ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవితరెడ్డి, సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ మధ్య జరిగిన సంభాషణలున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య రూ.20 లక్షలు ఇస్తానని చెప్పాడని వాటిని కూడా అప్పుగా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్ అప్పు పత్రం రాయించి అందులో సర్పంచ్ నవ్య సంతకం చేయించేందుకు యత్నించినట్లుగా తెలుస్తోంది. ఆడబిడ్డల ఉసురు తగులుతుంది ఫోన్ కాల్‌లో జరిగిన సంభాషణల్లో ప్రకారం ఎమ్మెల్యే రాజయ్యపై గతంలో తప్పుడు ఆరోపణలు చేశానని చెప్పి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పారని ప్రవీణ్ ఎంపీపీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ మళ్లీ ఈ అప్పు పత్రాలు ఏంటని ఎమ్మెల్యే రాజయ్యను తాను ప్రశ్నించానని ప్రవీణ్‌తో చెబుతోంది. మీరు అప్పు లాగా ఇచ్చిన డబ్బులు వారితో అవసరం తీరిన తర్వాత అడిగితే ఎక్కడి నుండి తెచ్చి ఇస్తారని అడిగినట్లు తెలిపారు. సర్పంచ్ నవ్య దిగి వచ్చి ఒప్పందం పేపర్లపై సంతకాలు పెడుతాననంటే వారు అడిగిన డబ్బులు ఎందుకు ఇవ్వరని ఎమ్మెల్యేను ప్రశ్నించానని అన్నారు. మీకు సిగ్గు శరం లేదని నా అటువంటి ఆడబిడ్డల కడుపు కొట్టి సంపాదించినందుకు మా ఉసురు తగులుతుందని ఎమ్మెల్యే రాజయ్యనును అన్నట్లు ఆ కాల్ రికార్డులో తెలుస్తోంది. ప్రవీణ్, నవ్యలు అప్పు పత్రంపై సంతకాలు పెట్టరని, దానికి నేను కూడా ఓప్పుకోనని ఎమ్మెల్యేతో అన్నట్లు మాట్లాడింది. రేపు ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ రాదని అప్పుడు ఇచ్చిన అప్పులు వసూలు చేస్తారా? అని అడిగినట్లు తెలిపారు. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది గతంలో ముగ్గురం కలిసి వచ్చినప్పుడు అప్పు పత్రంపై సంతకాలు చేయాలని అడగలేదు కదా అని అన్నారు. రూ.6 లక్షలు బంజరుపల్లికి చెందిన వ్యక్తికి ఎందుకు ఇచ్చినట్టని, వాడు మన పార్టీ వాడు కాదు కదా అన్నారు. ఇప్పడివరకు మాకు రూపాయి కూడా ఇవ్యలేదని వాడికి ఎలా ఇస్తారని ఎమ్మెల్యే రాజయ్యను ప్రశ్నించినట్లు ప్రవీణ్‌తో అన్నారు. అప్పు పత్రం గురించి నాకు తెలియదని, ఒప్పంద పత్రంపై మాత్రమే సంతకాలు పెట్టాలని చెప్పినట్టు గుర్తు చేసింది. ఇలాంటి ఆరోపణలు మళ్లీ చేస్తే సర్పంచ్ దగ్గరకు వెళ్లి నాది తప్పైందని బతిమాలుకుంటానని తర్వాత మీ సంగతి వాళ్లే చూసుకుంటారని హెచ్చరించానని తెలిపారు. గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు కూడా నేనే వాళ్లతో మాట్లాడి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ వస్తే మీకు ఏదో విధంగా సహయం చేయిస్తానని అంటే అప్పుడు వాళ్లు సరేనని ఒప్పుకున్నారని అన్నట్లు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్ ప్రవీణ్‌కు మధ్య జరిగిన సంభాషణలో కూడా డబ్బుల వ్యవహరమే ఉంది. ఎమ్మెల్యే రాజయ్యతో నాకు నా భర్తకు ప్రాణహాని ఉందని అన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి