Telangana: తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ(TGSPDCL) బిగ్ షాక్ ఇచ్చింది. ఫోన్ పే, పేటీఎం, జీ-పే, ఆమెజాన్ పే లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపును నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు RBI ఆదేశాలతో చెల్లింపులు నిలిపివేసినట్లు తెలిపింది. జులై 1నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఇకపై TGSPDCL వెబ్‌సైట్, యాప్ ద్వారా మాత్రమే కరెంట్ బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది.
'ప్రియమైన వినియోగదారులారా.. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లు అనగా PhonePe, Paytm, Amazon Pay, Google Pay అండ్ బ్యాంకులు ద్వారా విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశాం. అందువల్ల వినియోగదారులందరూ దయచేసి 01/07/2024 నుంచి TGSPDCL వెబ్‌సైట్/TGSPDCL మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లింపులను చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం' అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే విద్యుత్ శాఖ తాజా నిర్ణయంపై వినియోగదారుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.