Petrol Prices in Budget : లీటర్ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు..? మధ్యంతర బడ్జెట్‌వైపే అందరి చూపు! నేడు పార్లమెంట్‌లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా లీటర్‌పై రూ. 5 నుంచి రూ.10 వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. By Trinath 01 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Interim Budget 2024 : ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్(Interim Budget) పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోదీ సర్కార్(Modi Sarkar) జనాకర్షక నిర్ణయాలేమైనా ప్రకటిస్తుందా? లేక ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుందా.. అనే చర్చ దేశమంతటా వినిపిస్తోంది. ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్లో కేంద్రం వరాలు జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నవేళ పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక శక్తి సన్నగిల్లుతోంది. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండబోతుందని, ముఖ్యంగా వాహనదారులకు బడ్జెట్‌లో తీపికబురు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారం తగ్గిస్తారా? పెట్రోల్(Petrol), డీజిల్ ధరల వల్ల కూడా మధ్యతరగతి ప్రజలపై తీవ్రభారం పడుతోంది. ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol, Diesel Rates) తగ్గించొచ్చని తెలుస్తుంది. పెట్రోల్ ధరలను తగ్గిస్తే సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. లీటర్‌పై రూ. 5 నుంచి రూ.10 వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించడం సహా వాహనాలకు రాయితీ లాంటి ప్రకటనలు కూడా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు లేదా సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మధ్యంతర బడ్జెట్‌లో సామాన్యులకు లబ్ది చేకూరేలా తాయిలాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి నిర్మలాసీతారామన్ లెక్కలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి. కేంద్ర కేబినెట్ భేటీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) కు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రి, ముఖ్య అధికారులు ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఇక్కడే మధ్యంతర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. Also Read: రైతులకు బడ్జెట్‌లో తీపి కబురు.. పీఎం కిసాన్ పెంపు?? ఎంతంటే? WATCH: #union-budget-2024 #nirmala-sitharaman #interim-budget-2024 #2024-budget-expectations #petrol-prices మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి