Petrol And Diesel Rates : పెట్రోల్ రేట్లు మారలేదు.. ప్రస్తుతం ఎంతంటే.. 

క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నా.. ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆయిల్ కంపెనీలు యధాతథంగా కొనసాగిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. 

New Update
Petrol And diesel Price : క్రూడాయిల్ ధరలు పై పైకి.. మన దేశంలో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. 

Petrol and Diesel Rates Today : క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. మరోవైపు యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం అంటే ఈ ఉదయం (30.08.2024) 6 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 79.94 డాలర్లుగా ఉంది. WTI ముడి చమురు 75.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ ప్రభావం భారత్ లో కనిపించలేదు. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మార్పులు లేకుండా  కొనసాగుతున్నాయి. 

ముడి చమురు ప్రధాన దిగుమతిదారుగా, భారతదేశం పెట్రోల్, డీజిల్ ధరలు భారత్, US డాలర్ మధ్య మారకం రేటు ద్వారా ప్రభావితమవుతాయి. పెట్రోల్‌, డీజిల్‌కు డిమాండ్‌ కూడా వాటి ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ ఇంధనాలకు డిమాండ్ పెరిగితే, అది అధిక ధరలకు దారితీయవచ్చు.

పెట్రోలు - డీజిల్ ధర(Petrol And Diesel Rates) ముడి చమురును శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చుతో ప్రభావితం అవుతుంది. శుద్ధి ప్రక్రియ ఖరీదైనది అలాగే ఉపయోగించిన ముడి చమురు రకం,  రిఫైనరీ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా శుద్ధి ఖర్చులు మారవచ్చు.

ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. స్థానికంగా ఉండే పన్నులు, రవాణా ఛార్జీలు ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉంటాయి. 

ఈరోజు అంటే 30.08.2024 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72, డీజిల్ ధర రూ.87.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.44, డీజిల్ ధర రూ.89.97గా ఉంది. కోల్‌కతా (Kolkata) లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.95, డీజిల్ ధర రూ.91.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.75, డీజిల్ ధర రూ.92.34గా ఉంది.

Noida : లీటర్ పెట్రోల్ రూ. 94.83, డీజిల్ రూ. 87.96 గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ రూ. 95.19, డీజిల్ రూ. 88.05. బెంగళూరు: లీటర్ పెట్రోల్‌ రూ.102.86, డీజిల్‌ రూ.88.94. చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.94.24, డీజిల్ లీటర్ రూ.82.40, హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65. జైపూర్: లీటర్ పెట్రోల్ రూ.104.88, డీజిల్ రూ.90.36. పాట్నా: లీటర్ పెట్రోల్ రూ.105.18, డీజిల్ రూ.92.04.

Also Read : బంగాళాఖాతంలో అల్పపీడనం..వాయుగుండంగా మారే ఛాన్స్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు