BRS MLA'S: చిక్కుల్లో కేటీఆర్, హరీష్ రావు.. ఏం జరగనుంది?

కేటీఆర్, హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి. 24 స్థానాల్లో గెలుపును సవాల్ చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలు చేశారు ఓడిన అభ్యర్థులు. రాబోయే రోజుల్లో పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

New Update
BRS MLA'S: చిక్కుల్లో కేటీఆర్, హరీష్ రావు.. ఏం జరగనుంది?

KTR, Harish Rao: బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR), ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy) కి షాక్ తగిలింది. వీరి ఎన్నిక (Election) చెల్లదంటూ హైకోర్టులో (Telangana High Court) పిటిషన్లు దాఖలు అయ్యాయి. హైకోర్టును ఆశ్రయించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు. 24 స్థానాల్లో గెలుపును సవాల్ చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలు చేశారు. జాబితాలో కేటీఆర్, హరీష్‌ రావు, పాడి కౌశిక్ రెడ్డి పేర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. కేసీఆర్‌కు షాక్?

మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గెలుపును సవాల్ చేస్తూ కె.కె.మహేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కొడుకు హిమాన్షును డిపెండెంట్‌గా చూపించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. హిమాన్షు పేరిట ఉన్న 32 ఎకరాల సేల్‌ డీడ్‌ కోర్టుకు సమర్పించారు మహేందర్ రెడ్డి. అలాగే.. హరీష్‌ రావు గెలుపును సవాల్ చేస్తూ BSP అభ్యర్థి చక్రధర్ గౌడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి గెలుపును సవాల్ చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లిహిల్స్‌లో మాగంటి గోపినాథ్‌ గెలుపును సవాల్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు గెలుపును సవాల్ చేశారు బండి రమేష్‌. వీటితో పాటు గద్వాల, ఆసిఫాబాద్‌, కొత్తగూడెం,పటాన్ చెరు, కామారెడ్డి, షాద్‌నగర్‌, ఆదిలాబాద్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాబోయే రోజుల్లో పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఫిడవిట్‌లో అవకతవకలు, ఈవీఎం, వీవీపాట్‌ సమస్యలపై కూడా పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో దాఖలు అయినట్లు సమాచారం

ఇది కూడా చదవండి: 9వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు