Breaking: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు షాక్ ఇచ్చారు ఏపీ సీఐడీ అధికారులు. ఆయన పై విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ యువగళం ముగింపు సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు అధికారులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల పేర్లు రెడ్ డైరిలో వ్రాసుకున్నామని లోకేష్ వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో తెలిపారు. లోకేష్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ కోర్టును కోరారు సీఐడీ అధికారులు.
Also Read: తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి ఆక్సిజన్.
కాగా, యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో భారీ బహిరంగా సభ నిర్వహించారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సభ సందర్భంగా జగన్ పై వీరందరు నిప్పులు చెరిగారు.
ఈ క్రమంలోనే నారా లోకేష్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని..చట్టాన్ని ఉల్లఘించిన అధికారుల పేర్లు అన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయని వారికి శిక్ష తప్పదని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టం..వడ్డితో సహా చెల్లిస్తాం అని వ్యాఖ్యనించారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఏపీ సీఐడీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. లోకేష్ చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.