Rahul Gandhi: రాహుల్ గాంధీపై హైకోర్టులో పిటిషన్

రాహుల్ గాంధీపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎం హ్యాకింగ్ కేసులో శివసేన నేత రవీంద్ర వైకర్‌పై కేసు నమోదైందని తప్పుడు కథనాలు సృష్టించి రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.

New Update
Rahul Gandhi: రాహుల్ గాంధీపై హైకోర్టులో పిటిషన్

Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీతో పాటు శివసేన (యుబిటి) నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, యూట్యూబర్ ధృవ్ రాథీలపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎం హ్యాకింగ్ కేసులో షిండే వర్గానికి చెందిన శివసేన నేత రవీంద్ర వైకర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు అయిందని తప్పుడు కథనాలు ప్రచారం చేశారని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. తప్పుడు ప్రచారాలు చేసినందుకు వారిపై చర్యలు తీసుకునేలా చూడాలని కోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.

Advertisment
తాజా కథనాలు