/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2-2-jpg.webp)
Telugu news సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లతో కలకలం సృష్టించిన వ్యక్తిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. నర్సాపూర్‌లో జరిగిన సభ ప్రాంగణంలో ఓ వ్యక్తి రెండు బుల్లెట్లతో పట్టుబడిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం చండూరుకు చెందిన అస్లం ప్రస్తుతం ఓ యూట్యూబ్ చానల్‌కు విలేఖరిగా వ్యవహరిస్తున్నాడు. ఆ క్రమంలోనే సీఎం సభ కవరేజీ కోసం నర్సాపూర్ వచ్చాడు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా పర్సులో రెండు బుల్లెట్లను గుర్తించారు. తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎన్సీసీ కేడెట్‌గా ఉన్నాడని, ఆ సమయంలో ఎన్సీసీ ట్రైనింగ్ నుంచి అక్రమంగా రెండు 7.65ఎంఎం బుల్లెట్లు తెచ్చాడని నర్సాపూర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.