ఉసిరి జ్యూస్ (Amla juice) ప్రతిరోజూ తాగడం వల్ల వెయిట్ పెరగకుండా ఉండటమే కాదు, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.ఇండియన్ గూస్‌బెర్రీగా పేరున్న ఉసిరి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో కొన్ని రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. ఈ ఉసిరిలో విటమిన్ సీ (Vitamin C) ఉండటంతో బలవర్ధకమైన యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) ఉంటాయి. దీన్ని అలాగే పచ్చిగానే తీసుకుంటారు. లేకపోతే ఎండినవి కూడా తింటారు. అమ్లా జ్యూస్, మురబ్బాగా కూడా తింటారు.
పోషకాహార నిపుణులు ఈ ఉసిరితో జలుబు, దగ్గును తగ్గించుకునే పర్ఫెక్ట్ హోం రెమిడీ అని సిఫార్సు చేస్తున్నారు. ఇది మెటబాలిజం రేటును పెంచడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి తినడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో కేలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. మొత్తానికి ఇది బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఉసిరి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఉసిరికాయను తినడం వల్ల శరీరంలోని చెబు కొలెస్ట్రాల్‌ను (Cholesterol) తగ్గిస్తుంది. ఉసిరిలో క్రోమీయం ఎక్కువగా ఉంటుంది. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెడతాయి.
యాంటీ ఏజింగ్..
ఉసిరిలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చాలా రోగాలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ర్యాడికల్స్ ఏజింగ్, రింకిల్స్‌ను సమస్యను తగ్గిస్తాయి. ప్రతిరోజు ఉసిరి రసం తాగడం వల్ల ఏజింగ్ సమస్యను తగ్గిస్తుంది. చర్మ రోగాలను తగ్గిస్తుంది.
ఉసిరి రసం తయారీ విధానం..
ఉసిరి కాయల నుంచి విత్తనాలను తీసేసి జ్యూసర్‌లో వేసుకోవాలి. వీటిని స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసుకుని గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. నిపుణుల ప్రకారం 30 ఎంఎల్ ఆమ్లా జ్యూస్‌కు 20 ఎంఎల్ గోరువెచ్చటి నీటిని కలుపుకోవాలి. దీన్ని పరగడుపున తీసుకోవాలి.
ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఇది మిమ్మల్ని డిటాక్స్ చేసి త్వరగా బరువు తగ్గడానికి సహాయపుడతుంది.
Also Read: గోర్లు అదే పనిగా పెంచుతున్నారా..? ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి