Skin Habits : చర్మం పైపొరలో ఉండే రంధ్రాలు ఎప్పుడూ హెల్దీగా ఉంటే స్కిన్(Healthy Skin) తాజాగా ఉంటుంది. అలాకాకుండా అవి మూసుకుపోతే క్రమంగా చర్మ సమస్యలు(Skin Problems) మొదలవుతాయి. చర్మ రంధ్రాలను సహజంగా ఉంచేందుకు తగినంత నీరు తాగడం చెమట పట్టేలా వ్యాయామం(Exercise) చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఈ అలవాట్లు లేకపోవడం వల్లనే చాలామందికి చర్మం నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి అందంగా ఉండాలనుకుంటే ఈ మిస్టేక్స్ చేయొద్దు.
చర్మాన్ని తాజాగా ఉంచుకోవాలంటే దాన్ని తరచూ చేతితో తాకడం మానుకోవాలి. ఊరికే అద్దంలో చుసుకోవడం, మొటిమ(Pimples) లను గిల్లడం వంటి అలవాట్ల వల్ల బ్యాక్టీరియా మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి అందంగా ఉండాలనుకుంటే అద్దంలో చూసుకోవడాన్ని తగ్గించాలి. కేవలం లేపనాలు పూయడమే కాకుండా అప్పుడప్పుడు చర్మంలోని డెడ్ సెల్స్‌ను కూడా రిమూవ్ చేస్తుండాలి. అప్పుడే చర్మం తాజాగా మెరుస్తూ ఉంటుంది. దీనికోసం స్క్రబింగ్, కాటన్ ఎక్స్‌ఫాలియేషన్.. అంటే మెత్తటి వస్త్రంతో చర్మంపై రుద్దడం వంటివి చేస్తుండాలి.
అతిగా మేకప్(Makeup) వేసుకునే అలవాటు వల్ల కూడా చర్మం పాడవుతుంటుంది. కాబట్టి అందంగా ఉండాలనుకునేవాళ్లు మేకప్‌ను తగ్గించాలి. తేలికపాటి టోనింగ్, మాయిశ్చరైజింగ్‌తో చర్మాన్ని తేమగా ఉంచుకుంటే సరిపోతుంది. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా స్కిన్ డల్ అవుతుంది. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే తాజాగా మారుతుంది. నూనె పదార్థాలు తీసుకుంటే పాడవుతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్త అవసరం. ఇక అతిగా ఫోన్ వాడడం, మొబైల్ స్క్రీన్‌ను చెంపకు ఆన్చి ఫోన్ మాట్లాడడం, బెడ్ షీట్లు, దిండు కవర్లు తరచూ శుభ్రం చేసుకోకపోవడం, రోజుకి రెండు సార్లు స్నానం చేయకపోవడం వంటి అలవాట్లు కూడా చర్మ సౌందర్యాన్ని పాడు చేస్తాయి.
Also Read : అల్పాహారంగా ఓట్స్ తింటున్నారా..అయితే జాగ్రత్త అంటున్న వైద్యులు!