Pakistan : పాకిస్థాన్ లో సైన్యానికి వ్యతిరేకంగా ప్రజల నిరసనలు 

పాకిస్థాన్ సరిహద్దుల్లో సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రజలు పాక్ సైన్యం ఉగ్రవాదుల పేరుతో తమను వేధిస్తోందంటూ నిరసనలకు దిగారు. ఆందోళన చేస్తున్నవారిపై సైన్యం కాల్పులు జరపడంతో 7గురు మరణించారు. 

New Update
Pakistan : పాకిస్థాన్ లో సైన్యానికి వ్యతిరేకంగా ప్రజల నిరసనలు 

Pakistan Army : పాకిస్థాన్ సరిహద్దు ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రజలు సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ ప్రాంతంలోని 10 వేల మందికి పైగా పష్తున్ ప్రజలు శనివారం వీధుల్లో ఉన్నారు. ఆందోళనకారులు 'ఆర్మీ గో బ్యాక్' అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సైన్యం భీభత్సం సృష్టించిందని అంటున్నారు. ఆ ప్రాంతంలో సైన్యం ఉండడంతో అశాంతి నెలకొని ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ఖైబర్ (Khyber) ప్రాంతంలో నిర్వహిస్తున్న మిలటరీ ఆపరేషన్‌ను ఆపాలని పాష్తూన్లు డిమాండ్ చేస్తున్నారు. నిరసన నాయకుడు జమాలుద్దీన్ వజీర్ ప్రకారం, పాకిస్తాన్ సైన్యం 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ప్రచారం పేరుతో ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతోంది.

Pakistan ఉగ్రవాదం పేరుతో పాక్ సైన్యం సామాన్య ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. ఎవరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేస్తుంది. శుక్రవారం, ఆందోళనకారులు సైనిక శిబిరాన్ని చుట్టుముట్టడంతో సైన్యం కాల్పులు జరిపింది. దీంతో ఇప్పటి వరకు 7గురు ఆందోళనకారులు చనిపోయారు.

ఈ ఏడాది ప్రారంభంలో, సైన్యం ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) సరిహద్దు ప్రాంతాల్లో హింసను ఎదుర్కోవడానికి కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ చొరబడిందని ప్రభుత్వం చెబుతోంది. ఖైబర్ తదితర ప్రాంతాల్లో ఈ సంస్థ తీవ్రవాద దాడులకు పాల్పడుతోంది. అయితే, టీటీపీలో ఆపరేషన్ పేరుతో సామాన్య పాష్తూన్లను టార్గెట్ చేస్తోందని ఖైబర్ ఫక్తున్ఖ్వా వాసులు చెబుతున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు.

Also Read: యెమెన్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం..

ఖైబర్‌లో 24 గంటల్లో మూడు ఉగ్రదాడులు..
24 గంటల్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో 4 మంది మరణించారు. అదే సమయంలో 30 మంది గాయపడ్డారు. ఇప్పుడు ఆత్మాహుతి దాడులే కాకుండా రిమోట్ కంట్రోల్, డ్రోన్ల ద్వారా కూడా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఏడాది మొదటి 4 నెలల్లో 179 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. వీటిలో సైన్యం, పోలీసులను లక్ష్యంగా జరిగినవే ఎక్కువ. 

ఆందోళనకారులు - సైన్యం మధ్య ఘర్షణ తర్వాత ఖైబర్ పఖ్తుంక్వాలో హెల్త్ ఎమర్జెన్సీ (Health Emergency) విధించారు.  స్థానిక ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని విధించింది. పరిస్థితి దృష్ట్యా, ఖైబర్ ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ - ప్రభుత్వేతర ఆసుపత్రుల వైద్యులు అలాగే  పారామెడికల్‌లతో సహా ఆరోగ్య కార్యకర్తలందరినీ హై అలర్ట్‌గా ఉండాలని పాక్ ప్రభుత్వం కోరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు