AP: సెల్‌ఫోన్ సిగ్నల్ లేని ఊరు.. 108కు ఫోన్ చేయాలన్నా ఇబ్బందే..!

అనంతపురం జిల్లా బొంతలపల్లి గ్రామస్తులు సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108కు ఫోన్ చేయాలన్నా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

New Update
AP: సెల్‌ఫోన్ సిగ్నల్ లేని ఊరు.. 108కు ఫోన్ చేయాలన్నా ఇబ్బందే..!

Anantapur: సెల్ ఉంటే తప్ప సాంకేతికంగా ఏ పని చేసుకోలేని ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక బొంతలపల్లి (Bonthalapalli) గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం బొంతలపల్లి గ్రామ ప్రజలు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక సతమతమవుతున్నారు.

Also Read: హత్యా రాజకీయాలు మానుకోండి.. మాజీ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే వార్నింగ్.!

గ్రామంలో పింఛను తీసుకోవాలన్నా, రేషన్ బియ్యం పొందాలన్నా సెల్ఫోన్ సిగ్నల్ (Mobile Signals) కోసం కొండగుట్టలు ఎక్కాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇంటి వద్దనే ఉంటూ ఉద్యోగం చేస్తున్న వారు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు.

Also Read: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..!

పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని చెన్నకేశవులు అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 108కు ఫోన్ చేయాలన్నా ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు గ్రామస్తులు.

Advertisment
తాజా కథనాలు