AP: హత్యా రాజకీయాలు మానుకోండి.. మాజీ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే వార్నింగ్.!

మాజీ సీఎం జగన్‌ హత్యా రాజకీయాలు చేస్తున్నాడని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. గతంలో హత్య చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారన్నారు. కానీ, తమ ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

New Update
AP: హత్యా రాజకీయాలు మానుకోండి.. మాజీ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే వార్నింగ్.!

MLA Budda Rajashekar Reddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan) హత్యా రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడి కుటుంబానికి పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్ వారి నాయకులతో కలసి వచ్చి కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారన్నారు.

Also Read: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..!

అయితే, వైసీపీ నాయకులు కట్టకట్టుకుని వచ్చినా కూటమి ప్రభుత్వం భయపడదన్నారు. గతంలో హత్య చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారని, కానీ ఈ ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రెండు గ్రూపుల మధ్య ఉన్న తగాదాలపై జగన్ వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదన్నారు.

Also Read: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం.. టీడీపీ నాయకుల వార్నింగ్..!

హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలను జగన్ తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీకి, మాజీ ఎమ్మెల్యే శిల్పాకు ఎందుకు ఫోన్ చేయలేదు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా జగన్ తన తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు