రాజస్థాన్‌లో బిపర్‌జాయ్ తుఫాన్ బీభత్సం బిపర్‌జాయ్ తుఫాన్‌తో గజగజ వణుకుతున్న ప్రజలు.. రాజస్థాన్‌లో ఎక్కడికక్కడ స్తంభించిపోయిన జనజీవనం.విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం. పెనుముప్పు నుంచి తప్పించుకున్న పాకిస్తాన్. By Vijaya Nimma 17 Jun 2023 in నేషనల్ New Update షేర్ చేయండి భారీ ఆస్తి నష్టం బిపర్‌జాయ్ తుఫాన్ ధాటికి గజగజ వణికిపోయింది గుజరాత్. ప్రధానంగా కచ్, సౌరాష్ట్ర రీజియన్‌లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. 4,600 గ్రామాలకు కరెంట్ సప్లై ఆగిపోయింది. ఐతే 3,580 గ్రామాలకు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. మరో వెయ్యి గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. భీకర గాలుల ధాటికి పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ఒక్క కచ్ జిల్లాలోనే 40శాతం నష్టం సంభించింది. 18 NDRF బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. రంగంలోకి దిగిన అధికారులు చెట్లు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇక పాకిస్తాన్‌కు పెను ముప్పు తప్పింది. తుఫాన్ తీరం దాటుతున్న టైంలో బలహీనపడటంతో పాకిస్తాన్‌కు పెద్దగా నష్టం జరగలేదు. తుఫాన్ ముప్పు నుంచి సింధ్ బయటపడింది. దీంతో పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రాజస్థాన్‌లో బిపర్‌జాయ్ బీభత్సం సృష్టిస్తోంది. జలోర్, బార్మర్ జిల్లాల్లో కుండపోత వానలు పడటంతో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ , మరో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ IMD ప్రభుత్వం ప్రకటించింది. వర్షాల దెబ్బకి పలు రైళ్లు, విమానాలు రద్దు చేశారు. భీకర గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు వీరిగి పడ్డాయి. దీంతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ బలహీనపడినా ప్రభావం మాత్రం తగ్గటం లేదని, జోరు వానలతో జనజీవనం అస్తవ్యస్తం మారిందని వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారి వాహదారులు ఇబ్బదులు పడుతున్నారు. మరో రెండ్రోజులు వానలు కూరుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌కి గండం తప్పింది తుఫాన్ ఎఫెక్ట్‌తో రాజస్థాన్ జోధ్‌పూర్ వర్సిటీలో జరగాల్సిన అన్ని పరీక్షలు రద్దు చేశారు అధికారులు. రాజస్థాన్‌లో కేంద్రం NDRF బృందాలు మోహరించి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. గుజరాత్ తీర ప్రాంతంలో తీరం దాటడంతో తుఫాను గండం నుంచి పాకిస్తాన్ పెను ముప్పు నుంచి బయటపడంతో పాకిస్తాన్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి