కంద దుంప నుండి అరటి గెల..ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..?

బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమయింది. వేపచెట్టుకు పాలు కారడం లాంటి అనేక వింతలు చోటుచేసుకుంటున్నాయి. అటువంటి వింత ఒకటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. కంద దుంప నుండి అరటి గెల ఆకృతి రావడంతో అందురు షాక్ అవుతున్నారు. అంతే కాదు దానికి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.

New Update
కంద దుంప నుండి అరటి గెల..ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..?

Ambedkar Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District)లో వింత సంఘటన చోటుచేసుకుంది. కంద దుంప నుండి అరటి గెల ఆకృతి రావడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం తిళ్ళికుప్ప గ్రామంలో ఈ వింత ఘటన జరిగింది. వేగిరాజు సుబ్బరాజు నివాస స్థలంలో కంద దుంప నుండి అరటి గెల కనిపించడంతో స్ధానికులు హల్ చల్ చేస్తున్నారు. వాటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కంద దుంప నుండి అరటి గెల ఆకృతిలో ఉన్న చెట్టు వచ్చిందని ఆనోటా.. ఈనోటా తెలియడంతో చుట్టుపక్కల గ్రామస్తులు సైతం ఈ వింతను చూడటానికి తండోప తండాలుగా తరలి వస్తున్నారు. ఆనంతరం ప్రతేక్య పూజలు చేస్తున్నారు.

ఇటువంటి వింతను ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. ఇది తప్పకుండా దైవాంశం కావచ్చని  కొందరు స్దానికులు భావిస్తున్నారు. ఇంటి ఆవరణలో కంద దుంప నుండి అరటి గెల లాంటి వింత జరగడంతో సంతోషిస్తున్నారు సుబ్బరాజు కుటుంబ సభ్యలు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందంటున్నారు. వేపచెట్టుకు పాలు కారడం లాంటి వింతలు కలికాలంలో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యనిస్తున్నారు. అయితే, కంద దుంప నుండి అరటి గెల రావడానికి కారణం ఏదైనా కావొచ్చు కానీ.. పూజలు చేయడం  ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరి చిన్న పిల్లలు మాత్రం కంద దుంప నుండి అరటి గెల ఆకృతి రావడం భలే వింతగా ఉంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నిమజ్జనంలో డ్యాన్స్ తో దుమ్ములేపిన చిరంజీవి, పవర్ స్టార్, బాలయ్య.. వైరల్ గా మారిన వీడియోలు!

Advertisment
తాజా కథనాలు