Six Fingers : కొందరి చేతికి ఆరు వేళ్లు ఎందుకు ఉంటాయి?.. కారణం ఇదేనా?

చేతికి లేదా కాళ్లకు ఆరు వేళ్లు ఉండటం అనేది జన్యువులోని పరివర్తన కారణంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అరుదైన రుగ్మత శిశువుల అదనపు వేళ్లు, బహుళ అవయవాల్లో లోపాలకు కారణమని గుర్తించారు. ఈ రుగ్మత కోసం ఒక మందును కనుగొన్నారు. ప్రస్తుతం ఇది ట్రయల్స్‌ దశలో ఉంది.

Six Fingers : కొందరి చేతికి ఆరు వేళ్లు ఎందుకు ఉంటాయి?.. కారణం ఇదేనా?
New Update

Six Fingers For Peoples : చాలా మంది చేతికి లేదా కాళ్లకు ఆరు వేళ్లు(Six Fingers) ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇటీవల పరిశోధకులు అదనపు వేళ్లతో పిల్లలు ఎందుకు పుడతారనే విషయాన్ని గుర్తించారు. ఈ ఆరోగ్య పరిస్థితికి ఇంకా పేరు పెట్టనప్పటికీ ఇది మాక్స్ అనే జన్యువులోని పరివర్తన కారణంగా జరుగుతుందని చెబుతున్నారు. ఈ అరుదైన రుగ్మత శిశువుల అదనపు వేళ్లు, బహుళ అవయవాల్లో లోపాలకు కారణమని గుర్తించారు. అదనపు వేళ్లు (పాలిడాక్టిలీ) ఉండటం అనేది మెదడు అభివృద్ధికి(Brain Development) సంబంధించిన ఆటిజం లక్షణాలకు దారితీస్తుందని UKలోని లీడ్స్ విశ్వవిద్యాలయం(Leads University) పరిశోధకుల బృందం తెలిపింది.

కంటి సమస్యలు:

  • ఈ జన్యు సంబంధాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఇది కొన్ని నాడీ సంబంధిత లక్షణాలకు చికిత్స చేయడానికి, వాటిని మరింత ఎక్కువ కాకుండా నిరోధించడానికి ఉపయోగించే అణువును కలిగి ఉన్నట్లు కనుక్కున్నారు. కొందరిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అదనపు వేళ్లతో పాటు ఆయా వ్యక్తులు ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటారని చెబుతున్నారు. సగటు కంటే పెద్ద తల చుట్టుకొలత, కంటి అభివృద్ధి ఆలస్యం, ఇతర కంటి సమస్యలు కూడా వారిలో కనిపించినట్టు వెల్లడైంది. ఈ వ్యక్తుల DNA అధ్యయనంలో వారికి పుట్టుకతో వచ్చే లోపాలు లేదా రుగ్మతలకు కారణం జన్యు పరంగా కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

భవిష్యత్‌లో చికిత్స:

  • ఈ లోపానికి ఎలాంటి చికిత్స లేదని, ప్రాణాంతకం కాదని వైద్యులు అంటున్నారు. భవిష్యత్‌లో చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఈ రుగ్మత కోసం ఒక మందును కనుగొన్నారు. ప్రస్తుతం ఇది ట్రయల్స్‌ దశలో ఉంది. ఇది మ్యూటేషన్‌ను పూర్తిగా నిర్మూలించకపోయినా కొన్ని ప్రభావాలను తిప్పికొట్టడానికి మాత్రం పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చిన్నప్పటి నుంచి ఈ లక్షణాలు బయటపడినా వైద్యుడిని సంప్రదించడానికి మాత్రం పదేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

ఇది కూడా చదవండి: నిద్రకు ముందు ఇలా చేస్తే మొటిమలు పెరుగుతాయి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #six-fingers #brain-development #leads-university
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe