తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం
ఖమ్మంలో జరిగిన జనగర్జన సభ విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఎంత నియంత్రించాలని చూసినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ప్రజలు కాంగ్రెస్ మీద అభిమానంతో సభను విజయవంతం చేశారని అన్నారు. తెలంగాణలో నియంతృత్వ కేసీఆర్ వైఖరి పట్ల ప్రజలలో నమ్మకం సన్నగిల్లింది.. దానితోపాటు కాంగ్రెస్‌పై నమ్మకం పెరిగిందన్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజలలో సానుకూలత ఉంది, వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యనించారు.
అధికారంలోకి రాగనే చేయూత పథకం
నియంతృత్వ కేసీఆర్ మీద ఈ ప్రభుత్వం మీద.. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు తానూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నిత్యం శ్రమిస్తానన్నారు. నిన్న ఖమ్మం సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయూత పథకాన్ని అందిస్తామని వృద్దులు , వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు బీడీ కార్మికులు, గీతా కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు ఇలా ప్రతి ఒక్కరికి కూడా చేయూత పథకం కింద నెలకి నాలుగు వేల రూపాయలు అందజేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిది.
గతంలో రైతు డిక్లరేషన్ గాని, యూత్ డిక్లరేషన్‌నే కాంగ్రెస్‌పై ప్రజలలో నమ్మకం పెంచిందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలు అమలు కాలేదు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తాం ప్రతి వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తాం అన్నారు.
ప్రతి హామీని ప్రతి ఒక్కరికి చేరేలా పని చేస్తాం
పత్రికలలో వచ్చినట్టుగా మా మధ్యన ఎలాంటి విభేదాలు లేవు మేమంతా కాంగ్రెస్ కుటుంబం అందరం కలిసికట్టుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం అన్నారు. గత 8 నెలలుగా నియోజకవర్గంలో తిరిగి.. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఫౌండేషన్ ద్వారా చాలా సమస్యలను తీర్చం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము పని చేస్తాం కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేస్తాం కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు.