Weather: నాలుగు రోజుల్లో 49 డిగ్రీలు..బయటకు వస్తే ఇక అంతే సంగతులు!

గతేడాది మే నెలతో పోల్చితే ఈ సారి 7.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నుంచి శనివారం వరకు తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతాయని భారతీయ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల 46 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి

Weather: నాలుగు రోజుల్లో 49 డిగ్రీలు..బయటకు వస్తే ఇక అంతే సంగతులు!
New Update

High Temperature For Next 4 Days: దేశ వ్యాప్తంగా భానుడు తన ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి అయితే చెప్పేట్లు లేదు. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ (Telangana) వ్యాప్తంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. మరో నాలుగు రోజుల్లో 49 డిగ్రీలకు చేరువ అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.

తెలంగాణ వ్యాప్తంగా వడగాల్పులు వీస్తాయని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అటు వైద్య నిపుణులు, ఇటు వాతావరణశాఖ అధికారులు (IMD) హెచ్చరిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల 46 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గురువారం 20 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

గతేడాది మే నెలతో పోల్చితే ఈ సారి 7.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నుంచి శనివారం వరకు తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతాయని భారతీయ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది సూర్యాపేటలో 46.5, భద్రాద్రి-కొత్తగూడెంలో 46.5, ములుగులో 46.5, పెద్దపల్లిలో 46.4, జగిత్యాలలో 46.4, మహబూబాబాద్‌లో 46.3, కరీంనగర్‌లో 46.2, వరంగల్‌లో 46.2, మంచిర్యాలలో 46.2, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 45.3, జనగామలో 45.3, యాద్రాద్రి-భువనరిరిలో 45.6, నిర్మల్‌లో 45.5, జయశంకర్‌లో 45.5, మహబూబ్‌నగర్‌లో 45.4, హనుమకొండలో 45.1, సిద్దిపేటలో 45.1, నారాయణపేటలో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలంగాణ స్టేట్‌ ప్లానింగ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. సోమవారం కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో అకడకడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గురువారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు కొనసాగాయి.

శుక్రవారం కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని చెప్పింది. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. 6 వరకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరిలో ఎండల తీవ్రత ఉంటుందని సూచించింది. 4 వరకు జార్ఖండ్‌లో, 3 వరకు కేరళ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది.

Also read: రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌..అమేథీ నుంచి బరిలో ఎవరంటే!

#telangana #alert #heat #temperatures
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe