Peddireddi Ramachandra Reddy: ఏపీలో మద్యం కంపెనీల యజమానులంతా వైసీపీ వాళ్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న కంపెనీల యజమానుల పేర్లను ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? అని సవాల్ విసిరారు. మద్యం డబ్బులను తాడేపల్లికి తరలించేందుకే డిజిటల్ పేమెంట్లను స్వీకరించడం లేదని దుయ్యబట్టారు. నాసిరకం మద్యం కారణంగా చనిపోయినవారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు వరుసగా పురందేశ్వరిపై మాటల దాడికి దిగారు.
Also Read: జగన్ నువ్వు పేదవాడివా.. అయితే వేల కోట్లు ఎలా వచ్చాయి..?
తాజాగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. నేడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ సందర్భంగా బీజేపీ పురందేశ్వరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున పురందేశ్వరి వకాల్తా పుచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమీ లేదన్నారు. కానీ, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
Also Read: జగన్ నువ్వు పేదవాడివా.. అయితే వేల కోట్లు ఎలా వచ్చాయి..?
పురందేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని పురందేశ్వరి గ్రహించాలని సూచించారు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్టుందని ఎద్దెవ చేశారు.