Telangana: వారంలో 2 సార్లు డయాలసిస్ .. అయినా తగ్గని ఆత్మవిశ్వాసం.. ఇంటర్ లో 927 మార్కులు! ఐదు సంవత్సరాల నుంచి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నప్పటికీ మొక్కవొని దీక్షతో కష్టపడి చదివి , వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ..ఇంటర్ లో 927 మార్కులు సాధించి కాలేజీ టాపర్ గా నిలిచిన గోదావరిఖని కి చెందిన సిరి కథనం మీకోసం..! By Bhavana 25 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి వారానికి రెండు సార్లు డయాలసిస్..ఒంట్లో ఓపికలేక కాలేజీకి వెళ్లలేని పరిస్థితి.. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఒంట్లో ఉన్న సత్తువనంత ఉపయోగించి మరీ పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ తన ప్రతిభను చాటింది. తెలంగాణలో బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కునారపు సిరి ఇంటర్ ఫలితాల్లో 927 మార్కులు సాధించి సత్తా చాటింది. కాలేజ్ లో టాపర్.. సీఈసీ విభాగంలో కాలేజీ టాపర్ గా నిలిచింది. గోదావరి ఖని ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన కునారపు పోశం, వెంకటలక్ష్మి దంపతుకలు ఇద్దరు కూతుళ్లు. పోశం సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదేళ్లుగా.. పెద్ద కుమార్తె సిరి ఐదు సంవత్సరాల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. రోజురోజుకీ వాటి పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది. ఎనిమిది నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో అప్పటి నుంచి వారానికి రెండు సార్లు రక్త శుద్ది చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది. పేరెంట్స్ ప్రోత్సాహం.. చదువు పై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన కాలేజీ ప్రిన్సిపల్, అధ్యాపకులు పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారాన్ని తోటి విద్యార్థుల సయాంతో ఆమెకు సెల్ ఫోన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసేవారు. ఆమె పరిస్థితిని చూసి దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లిదండ్రులు అన్ని విధాలుగా ప్రోత్సాహించారు. దీంతో సిరి సొంతంగా చదువుకొని పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించింది. దాతలు స్పందించి కిడ్నీ మార్పిడి వైద్య చికిత్సకు సహకరించాలని తండ్రి పోశం కోరుతున్నారు. Also read: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల..సత్తా చాటిన తెలుగు విద్యార్థులు! #telangana #inter-results #godavari-khani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి