Peddapalli: హైడ్రా ఎఫెక్ట్.. పెద్దపల్లిలో ఆక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ!

TG: పెద్దపల్లిలో ఆక్రమ కట్టడాలపై కలెక్టర్‌ ఫోకస్‌ పెట్టారు. చెరువుల ఆక్రమణలపై కలెక్టర్ సర్వే చేయించారు. బందంపల్లిలో ఆక్రమ నిర్మాణాలను గుర్తించిన కలెక్టర్.. అధికారులకు వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.

New Update
Peddapalli: హైడ్రా ఎఫెక్ట్.. పెద్దపల్లిలో ఆక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ!

Peddapalli: పెద్దపల్లిలో ఆక్రమ కట్టడాలపై కలెక్టర్‌ ఫోకస్‌ పెట్టారు. బందంపల్లిలో ఆక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉదయమే కూల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చెరువుల ఆక్రమణలపై కలెక్టర్ సర్వే చేయించారు. ఆక్రమణలపై మున్సిపల్‌ కమిషనర్‌కు నివేదిక అందించారు. నివేదిక ఆధారంగా బఫర్‌ జోన్‌లో ఉన్న కట్టడాలు కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. బందంపల్లి చెరువులో ఉన్న కట్టడాలు జేసీబీతో కూల్చివేస్తున్నారు. రాబోయే రోజుల్లో చెరువు ఆక్రమణాలు తొలగిస్తాం అని ఆర్డీవో తెలిపారు.

హైడ్రా కమిషనర్ సీరియస్ వార్నింగ్...

హైడ్రా (Hydra) కు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్ల పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) హెచ్చరించారు. గత కొద్ది రోజులు ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతం అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్ది మంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్ల ను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రా కు ఫిర్యాదు చేస్తామని, అలాగే అధికారులతో ఉన్న ఫోటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిగా లేదంటే హైడ్రా కు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడటంతో పాటు గత కొద్దికాలంగా బహుళ అంతస్తుల్లో, వ్యక్తిగత గృహల్లో నివాసం ఉంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడం జరుగుతోందని అన్నారు.

Also Read: పవన్ చూపెట్టింది AI వీడియోనా?.. నెట్టింట ట్రోల్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు