Keshav Payyavula: ఏపీ ఆర్ధికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్‌

AP: ఆర్ధికశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్‌ బాధ్యతలు చేపట్టారు. శాసన సభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు.

New Update
Keshav Payyavula: ఏపీ ఆర్ధికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్‌

Keshav Payyavula:ఏపీ ఆర్ధికశాఖ మంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు పయ్యావుల కేశవ్‌. శాసన సభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. అనంతరం ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.ఆర్ధికపరిస్థితిని మంత్రి పయ్యావులకు వివరించారు సెక్రటరీ కేవీవీ సత్యనారాయణ. సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు. అన్ని రకాల అప్పులు, ఆర్ధిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆర్ధికశాఖ అధికారులకు మంత్రి పయ్యావుల ఆదేశం ఇచ్చారు. రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ తనం తో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ అన్నారు.

Advertisment
తాజా కథనాలు