Paytm Crisis: పేటీఎం పేరు మార్చాలని ప్రయత్నించిన విజయ్ శేఖర్.. కానీ.. 

పేటీఎం వ్యవస్థాపకుడు.. పేమెంట్స్ బ్యాంక్ పార్ట్ టైమ్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ శర్మ బ్యాంక్ పేరును మార్చాలని గతేడాది సూచించారని తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదన అటు బోర్డులో కానీ, ఇటు రెగ్యులేటరీ అథారిటీస్ ముందు కానీ ఉంచలేదు. దీనికి కారణాలు తెలియరాలేదు. 

New Update
Paytm Crisis: పేటీఎం పేరు మార్చాలని ప్రయత్నించిన విజయ్ శేఖర్.. కానీ.. 

Paytm Crisis: పేటీఎం కంపెనీ నుంచి పక్కకు తప్పుకోవాలని వ్యవస్థాపకుడు.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పార్ట్ టైమ్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ శర్మ చూశారా? అసలు పేటీఎం పేరును మార్చాలనే ప్రతిపాదన కూడా తీసుకువచ్చారు? ఈ ప్రశ్నలకు నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. కొంత కాలంగా ఆర్బీఐ ఫైనాన్షియల్ సంస్థల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. పేటీఎం విషయంలోనూ గతంలోనే ఆర్బీఐ పలు హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో అప్పట్లోనే విజయ్ శేఖర్ శర్మ పేరు పేమెంట్ బ్యాంక్ (Paytm Crisis)పేరు నుంచి 'Paytm' అనే పదాన్ని తొలగించాలని కూడా ఆయన సిఫార్సు చేశారని తెలుస్తోంది.  

నేషనల్ మీడియా లో వస్తున్న వార్తల ప్రకారం.. RBI పెరుగుతున్న కఠినత దృష్ట్యా, బ్యాంక్ - Paytm యాప్ మధ్య సంబంధం లేకుండా చేసేందుకు.. భవిష్యత్ లో ఎప్పుడూ యాప్ (Paytm Crisis)విషయంలో ఇబ్బందులు లేకుండా చేసేందుకు పేరును తొలగించాలని గత సంవత్సరం ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. Paytm పేమెంట్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం ఆందోళన వ్యక్తం చేసింది. డిసెంబర్‌లో, సెంట్రల్ బ్యాంక్ Paytm బ్యాంక్‌కి షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ఆ తర్వాతే పేటీఎం పేరును తొలగించాలని శర్మ సూచించారు.  రెగ్యులేటర్ నుండి పెరుగుతున్న ప్రశ్నల మధ్య ఈ ప్రతిపాదనను ఆయన తీసుకువచ్చినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ-కామర్స్ ప్రధాన యాప్ అయిన Paytm గురించి RBI ఇంతకుముందు కూడా ప్రశ్నలను లేవనెత్తింది. అయితే, శర్మ చేసిన ఈ ప్రతిపాదనను అధికారికంగా బోర్డు ముందు ఎందుకు సమర్పించలేదో, దానిని రెగ్యులేటర్‌కు ఎందుకు పంపలేదో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Also Read:  పేటీఎం కష్టాలు పెరుగుతున్నాయి.. చైనా లింకులపై దర్యాప్తు!

పేటీఎం బ్యాంక్‌పై చర్యలు..
జనవరి 31, 2024న, RBI, Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై కఠినంగా వ్యవహరిస్తూ, ఫిబ్రవరి 29, 2024 తర్వాత బ్యాంక్ కస్టమర్ ఖాతా, ప్రీపెయిడ్ మోడ్, వాలెట్, ఫాస్టాగ్‌లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు, RBI నిబంధనలను పాటించడం లేదని Paytmని హెచ్చరిస్తూనే వచ్చింది. కానీ Paytm బ్యాంక్(Paytm Crisis) ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. దీని తర్వాత మాత్రమే రెగ్యులేటర్ ఈ చర్య తీసుకుంది.

Watch this Interesting Video :

Advertisment
తాజా కథనాలు