Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: పవన్

ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు.

Pawan Kalyan: అందుకు కాదు..నువ్వు పవర్‌ స్టార్‌ అయ్యింది!
New Update

PawanKalyan Fires On YCP Govt: ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. కేవలం భూముల మీదే ప్రేమ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల్లేవని, జాబ్ క్యాలెండర్ లేదని.. కానీ విస్సన్నపేట గ్రామంలో 13వేల కోట్ల రూపాయలతో అనుమతులు లేనిచోట రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక్కడ ఉన్న 600 ఎకరాలు భూములను కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఉరిలోకి రావడానికి సరైన రోడ్డు లేదని.. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను కాదు.. సీఎంనే అడుగుతున్నా.. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకమని ప్రశ్నించారు.

కొండలను పిండి చేశారు, ప్రభుత్వ భూములు, రైతులు భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర భూములను దోచేస్తున్నారని, తెలంగాణలోనూ ఇలాగే దోచేస్తే తన్ని తరిమేశారన్నారు. సీఎంగా ఉంటూ ఆయన చేసే అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. అడ్డగోలు అక్రమాలకు జగన్ (YS Jagan), రెవెన్యూ శాఖ, కలెక్టర్, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులను ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ దళితులకు ఇచ్చిన భూముల్లో రోడ్లు ఎలా వేస్తారు? అని నిలదీశారు. అడ్డగోలుగా భూములను దోచేస్తుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారని పవన్ నిలదీశారు. విసన్నపేట భూములు మీద కేంద్ర పర్యావరణ శాఖతో పాటు గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.

ఆదివారం గాజువాకలో నిర్వహించిన వారాహియాత్ర (Varahi Yatra) బహిరంగసభలో మాట్లాడిన పవన్.. గంగవరం పోర్టును జగన్ అమ్మేశారని ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్‌కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించింది. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గాజువాకలో ఓడిపోయినా.. తనకు ఘన స్వాగతం పలికారని ఎమోషనల్ అయ్యారు. విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన వారు.. గుడిలో ప్రసాదం తింటున్నారని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని జగన్ మాట్లాడారని.. కేంద్రాన్ని నిలదీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో భాగంగా గాజువాకలో ఏర్పాటు చేసిన సభలో ఆయన.. తనను ప్రేమతో స్వాగతం పలికిన గాజువాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: తెలంగాణలో మొదలైన ఎన్నికల వార్.. సై అంటే సై అంటున్న పార్టీలు

#pawan-kalyan #ys-jagan #pawan-kalyan-varahi-yatra #varahi-yatra-in-visakhapatnam #janasena-pawan-kalyan #pawankalyan-fires-on-ycp-govt #ycp-govt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe