Pawan Kalyan : కాకినాడ జిల్లా (Kakinada) పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడోరోజు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గంలో సమస్యలపై ఆయన దృష్టి పెట్టారు. ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. నిరాశ్రులైన బాధితులను కలవనున్నారు.
Also Read: వందలమంది ప్రాణాలకు కారణమైన ఈ భోలే బాబా ఎవరు? ఆయన ప్రత్యేకలేంటో తెలుసా?
ఇదే ప్రాంతంలో సముద్ర కోత తీవ్ర స్థాయిలో ఉండడానికి గల కారణాలు, వాటి స్థాయిని తగ్గించే చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం పిఠాపురం (Pithapuram) అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం టీడీపీ (TDP) బీజేపీ (BJP) నాయకులతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
పిఠాపురం నియోజవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురంలో సాయంత్రం నాలుగు గంటలకు వారాహి బహిరంగ సభలో పాల్గొనున్నారు. బహిరంగ సభ అనంతరం అక్కడి నుండి విజయవాడ బయలుదేరనున్నారు.