Pawan Kalyan : ఆడపడచులకు పవన్‌ పసుపు,కుంకుమ కానుక!

శ్రావణ మాస చివరి శుక్రవారం నాడు పిఠాపురం ఆడపడుచులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చీర, పసుపు, కుంకుమలను కానుక కింద అందజేయనున్నారు. పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించి ఈ కానుకలను అందజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

New Update
Pawan Kalyan : ఆడపడచులకు పవన్‌ పసుపు,కుంకుమ కానుక!

Pasupu Kumkuma Kanuka : నేడు శ్రావణ మాసం (Shravan Masam) చివరి శుక్రవారం అవ్వడంతో కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారలు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సొంత ఖర్చులతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలను అందజేయనున్నట్లు సమాచారం.

పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ ఆడపడుచులకు పవన్‌ పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను జనసేన నేతలు సర్దారు. ఈ కార్యక్రమం రెండు రోజులుగా చేబ్రోలులోని పవన్‌ నివాసం లో జరుగుతోంది.

publive-image

వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం ఉదయం పాదగయ క్షేత్రంలో అధిక సంఖ్యలో పోటెత్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు 2 వేల మందికే టోకెన్లు అందజేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా ఆరు వేల మందితో ఈ శ్రావణ మాస ఆఖరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఈఓ దుర్గా భవాని తెలిపారు.

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం..వాయుగుండంగా మారే ఛాన్స్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు