/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-107.jpg)
Akira Nandan : పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయసులోనే తన మల్టీ టాలెంట్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. పవన్ వారసుడి మూవీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య తన తండ్రి పక్కనే కనిపిస్తూ సందడి చేసిన అకీరా.. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
మ్యాటర్ ఏంటంటే, అకిరా చిన్నప్పటి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా సత్యాగ్రహి' సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. పవన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ పలు అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.
Akiranandan dancing at the Satyagrahi movie launch❤️🥹.
👑 @PawanKalyanpic.twitter.com/GZMgJGqbBN
— Vinayak Kumar (@VinayakJSP_) August 18, 2024
Also Read : సుడిగాలి సుదీర్ ‘G.O.A. T’… మూవీ నుంచి మరో సాంగ్
అయితే ఈ మూవీ లాంఛింగ్ టైం లో అకిరా బంగారం మూవీ టైటిల్ సాంగ్ కి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోలో అకిరా డ్యాన్స్ వేస్తుంటే పవన్, రేణు దేశాయ్ ఇద్దరూ కొడుకు డ్యాన్స్ చూసి తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.