Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే.. షెడ్యూల్ ఇదే..!

డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మొదటిసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 9.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా చేబ్రోలు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
AP : పిఠాపురంలో మూడో రోజు పవన్ పర్యటన..షెడ్యూల్ ఇదే..!

Independence Day 2024: ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఆయన పిఠాపురంలో గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా వెళ్లనున్నారు. ఉ. 8.55 గం. లకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.

పవన్ షెడ్యూల్ ఇదే..

ఉ. గం॥ 9.00 ని॥లకు జాతీయ పతాక ఆవిష్కరణ

ఉ. గం|| 9.05 ని॥లకు పోలీసు గౌరవ వందన స్వీకరణ

ఉ. గం॥ 9.15 ని॥లకు పవన్ కళ్యాణ్ సందేశం

ఉ. గం॥ 9.30 ని॥లకు పోలీసు కవాతు

ఉ. గం|| 10.00 ని॥లకు ప్రగతి శకటాల ప్రదర్శన

ఉ. గం॥ 10.30 ని॥లకు సాంస్కృతిక కార్యక్రమాలు

ఉ. గం॥ 11.00 ని॥లకు ప్రశంసాపత్రముల ప్రదానం

ఉ. గం॥ 12.00 ని॥లకు ముగియనున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

అక్కడి నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..నేరుగా చేబ్రోలు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: వైభవంగా జెండా పండగ.. ఎర్రకోటపై పతాకావిష్కరణ చేసిన ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు