Pawan Kalyan Affidavit: ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పవన్.. కొణిదెల ఫ్యామిలీ నుంచి అకీరా-ఆద్యలు ఔట్!

ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి పవన్ సమర్పించిన అఫిడవిట్ చర్చనీయాంశమైంది. ఇందులో పవన్-రేణుదేశాయ్‌లకు పుట్టిన పిల్లలు అకీరా-ఆద్యలను కొణిదెల ఫ్యామిలీగా చూపించలేదు. అకీరానందన్ దేశాయ్, ఆద్య దేశాయ్‌గా వారిపేర్లు కనిపించడంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. అఫిడవిట్ వైరల్ అవుతోంది.

New Update
Pawan Kalyan Affidavit: ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పవన్.. కొణిదెల ఫ్యామిలీ నుంచి అకీరా-ఆద్యలు ఔట్!

Pawan Kalyan Affidavit: స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు ఊహించని షా క్ ఇచ్చాడు. ఏపీ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 24న పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ వేశారు పవన్. అయితే ఆయన ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌ చర్చనీయాంశమైంది. పవన్-రేణుదేశాయ్‌లకు పుట్టిన పిల్లలు అకీరా-ఆద్య కొణిదెల వారసులుగానే ఉన్నారని అందరూ అనుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ!

కొణిదెల ఫ్యామిలీ నుంచి పిల్లలు తొలగింపు..
కానీ పవన్ అఫిడవిట్‌లో అకీరానందన్ దేశాయ్, ఆద్య దేశాయ్‌గా వారిపేర్లు కనిపించడం విశేషం. కాగా వీరి పేరు మీద పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఎటువంటి ఆస్తులు కూడా లేవు. ఇందులో కేవలం పవన్ ఐదేళ్ల సంపాదన, అప్పులు, పార్టీ ఇచ్చిన విరాళాల వివరాలు మాత్రమే చూపించారు. ఈ వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ బిత్తరపోతున్నారు. కొణిదెల ఫ్యామిలీ నుంచి పిల్లలను తొలగించడంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ అఫిడవిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు