త్వరలోనే పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా ఎంట్రీ!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన 'బ్రో' సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. హిట్ టాక్‌తో దూసుకెళ్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

త్వరలోనే పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా ఎంట్రీ!
New Update

ఫ్యాన్స్‌తో అకీరా సందడి..

మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజు నటించిన 'బ్రో' మూవీ విడుదలై హిట్ టాక్‌తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. వీకెండ్ కావడంతో థియేటర్ల వద్ద పవర్ స్టార్ అభిమానుల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు పవన్ తనయుడు అకీరా నందన్ కూడా మూవీ విడుదలైన రోజు థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో సినిమాను వీక్షించాడు. సినిమా చూస్తున్నంతసేపు ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశాడు. అకీరాను చూసిన ఫ్యాన్స్ సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. జూనియర్ పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

పుణేలో యాక్టింగ్ కోర్సు..

ఇప్పటికే పుణేలో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు అకీరా. దీంతో జూనియర్ పవర్‌స్టార్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే రైట‌ర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు అకీరా మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే పియానోపై సినిమా పాటలకు మ్యూజిక్ ప్లే చేసిన వీడియోలు కూడా నెట్టింట వైర‌ల్ అయ్యాయి. మరి ఫ్యాన్స్ అందరూ హీరోగా రావాలని వెయిట్ చేస్తుంటే అకీరా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది. కానీ మూవీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుతం యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటున్నాడు కూడా కాబట్టి భవిష్యత్తులో మూవీల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తన వయసు 19సంవత్సరాలు మాత్రమే కాబట్టి మరికొన్ని సంవత్సరాల తర్వాల హీరోగా వచ్చి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి.

రూ.100కోట్లు దిశగా..

మరోవైపు 'బ్రో' మూవీ రెండు రోజుల్లో 75 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్స్ మరింతగా పెరిగి మూడు రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలవనుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీ త్రివిక్రమ్ మాటలు చాలా ప్లస్ అయ్యాయి. ఒక మంచి ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. ఇక మూవీలో వింటేజ్ పవన్‌ కల్యాణ్‌ను చూపించడంతో థియేటర్స్‌లో విజిల్స్ మోగుతున్నాయి. సినిమా క్లైమాక్స్‌ సన్నివేశాలతో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో సినిమా అటు పవన్ అభిమానులకి, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe