Pawan Kalyan : యువతకు పవన్ సీరియస్ వార్నింగ్.. అలాంటి పనులు చేస్తే వాతలే!

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, భారీ శబ్దం చేసే సైలెన్సర్లతో ఇబ్బంది పెట్టే యువతను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పోలీసులను ఆదేశించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

Pawan Kalyan : యువతకు పవన్ సీరియస్ వార్నింగ్.. అలాంటి పనులు చేస్తే వాతలే!
New Update

AP News : ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాధులను వేగంగా పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఏ సమస్యైన్యా సరే తన దృష్టికి వచ్చిందంటే తక్షణమే అధికారులను ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటగిరి నుంచి వచ్చిన ఓ ఫిర్యాదుపై తిరుపతి (Tirupati) జిల్లా ఎస్పీతో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, భారీ శబ్దం చేసే సైలెన్సర్లను బైక్‌లకు బిగించి వీధుల్లో చక్కర్లు కొట్టే యువతకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పలువురు యువకులను (Youth) గుర్తించి వార్నింగ్‌ ఇచ్చారు. వీధుల్లో బైక్‌లు వేగంగా నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలిపారు.



Also Read : కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు.. సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం!

#tirupati-police #pawan-kalyan #bikers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి