Pawan Kalyan: అందుకే జీతం తీసుకోలేదు: పవన్ కళ్యాణ్

పంచాయతీరాజ్ శాఖలో ఖజానా ఖాళీగా ఉందన్నారు మంత్రి పవన్ కళ్యాణ్. అందుకే గత నెలకు సంబంధించిన జీతం తనకు ఏమీ వద్దని అధికారులకు చెప్పానన్నారు. డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక తనకు లేదని.. ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం మాత్రమే కావాలని స్పష్టం చేశారు.

New Update
Pawan Kalyan : పవన్‌ కు హరిరామజోగయ్య మరో లేఖ!

Pawan Kalyan: ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నేడు పిఠాపురం (Pithapuram) నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల (NTR Bharosa Pension Scheme) పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్దిదారులకు పింఛన్లు అందజేశాక సభను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.

Also Read: చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. ఇది మనకు ముఖ్యం: షర్మిల

ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని, వాటి అధ్యయనానికి, అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతోందని చెప్పారు. పంచాయతీరాజ్ మంత్రిగా (Panchayati Raj) జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా.. ఆ శాఖలో నిధులు లేవని.. అందుకే గత నెలకు సంబంధించిన జీతం ఏమీ వద్దని అధికారులకు చెప్పానన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియడం లేదన్నారు.

Also Read: డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్‌.. రెవెన్యూశాఖ కీలక సంస్కరణలు..!

పంచాయతీ రాజ్ శాఖలో తనవైపు నుంచి ఎలాంటి అవినీతికి తావుండదని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తానున్నట్లు చెప్పారు. మంత్రిగా సంబంధిత శాఖలను తీర్చిదిద్ది, పిఠాపురం నియోజకవర్గంను దేశానికి రోల్ మోడల్ గా అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక లేదని.. తనకు కావాల్సింది ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం మాత్రమేనని కామెంట్స్ చేశారు.

Advertisment
తాజా కథనాలు