Pawan Kalyan Quit To Movies : పవన్ కల్యాణ్ అభిమానులు ఇక ఆయన సినిమాలు చూడలేరు. పవన్ మేనియా ఇక కనిపించదు. 2024 ఎన్నికల్లో పవన్ గెలవడంతో పాటూ ఆంధ్రాలో కూటమి విజయం సాధించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పవన్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక తాజాగా ఆయనకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవితో (Deputy CM) పాటూ ఇంకా పంచాయతీ రాజ్, నీటి సరఫరా,పర్యావరణం, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇలా ఐదు పదవులు అప్పజెప్పారు.ఈ పదవులతో పవన్ పూర్తి రాజకీయాలకే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇన్ని పదవులకు సంబంధించిన బాధ్యతలను చూసుకోవడంతోనే సరిపోతుంది. ఇంకా సినిమా షూటింగ్స్ అంటే అది కుదరని పని. అందుకే ఇక మీదట పవన్ సినిమాలు చేయరని చెబుతున్నారు.
అసలు పవన్ సినిమాలు చేయడం మానేస్తారని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇంతకు ముందు ఆయనే స్వయంగా చాలా సార్లు ఆ మాట కూడా అన్నారు. 2019 ఎన్నికలప్పుడూ సినిమాలకు టాటా బైబై అన్న పవన్ అప్పుడు ఓడిపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. డబ్బులు కావాలికాబట్టి సినిమాలు చేస్తాను అని చెప్పారు. అయితే ఈ ఐదేళ్ళల్లో కూడా పెద్దగా ఏమీ చేయలేదు. పట్టుమని ఐదు సినిమాలు కూడా రాలేదు.
ఓడిపోయినా పవన్ రాజకీయాలకు దూరంగా ఉండలేదు. జనాల్లో ఉంటూ తిరుగుతూ వారికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడ్డ తర్వాత అయితే సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. ఇప్పుడు అదే శాశ్వతం కానుంది. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు త్వర త్వరగా కంప్లీట్ చేసుకుని పవన్ మూవీస్‌కు శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తారు.
Also Read : ‘స్వాగ్’ నుంచి రేజర్ క్యారెక్టర్ రివీల్.. డిఫరెంట్ అవతార్ లో అదరగొట్టిన శ్రీవిష్ణు!
ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాలు సెట్స్ పై ఉండగా.. సురేందర్ రెడ్డితో ఓ సినిమా ప్రకటించాడు. హరీష్ శంకర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. OG షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. ఎలక్షన్ హడావిడి లేకుంటే ఈ పాటికి రిలీజ్ కూడా చేసేసేవారు. కానీ పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడంతో ఇంకాస్త షూట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. అటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలది కూడా అదే పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ కి ఇవే చివరి సినిమాలు కానున్నాయి.