Pawan Kalyan: నా బిడ్డను కిడ్నాప్ చేశారన్న.. మహిళ ఫిర్యాదుతో పవన్ ఏం చేశారంటే?

తొమ్మిది నెలల క్రితం తమ మైనర్ కూతురును ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశారంటూ భీమవరానికి చెందిన ఓ తల్లి ఫిర్యాదుపై ఏపీ డిప్యూటి సీఎం పవన్ స్పందించారు. మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు పంపించారు.

New Update
Pawan Kalyan: నా బిడ్డను కిడ్నాప్ చేశారన్న.. మహిళ ఫిర్యాదుతో పవన్ ఏం చేశారంటే?

Vijayawada: ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ పాలనలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్న ఆయన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నేరుగా ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన సమస్యలకు సంబంధించి అధికారులు, పోలీసులకు వెంటనే ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఓ యువతి మిస్సింగ్ కేసు తన దృష్టికి రావడంతో వెంటనే సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్న వీడియో వైరల్ అవుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడలో చదువుకుంటున్న తన మైనర్ కుతురును ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారంటూ భీమవరానికి చెందిన శివకుమారి అనే బాధితురాలు పవన్ ముందు కన్నీరు పెట్టుకుంది. గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని, మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించట్లదని ఆవేదన చెందింది. అంతేకాదు జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని వాపోయింది.

దీంతో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన పవన్.. మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు. అయితే పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తమ సమస్యలు చెప్పుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు