వారాహి యాత్ర రెండో దశ ఫైనల్‌ చేసిన పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి విజయయాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం జనసేన నాయకులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. రెండో దశ యాత్రకు సంబంధించి చర్చించారు.

New Update
వారాహి యాత్ర రెండో దశ ఫైనల్‌ చేసిన పవన్ కళ్యాణ్

 Pawan Kalyan made the final of the second stage of Varahi Yatra

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. మొదటి దశ వారాహి యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో, రెండో దశ వారాహి విజయయాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన ఏలూరు నుంచి వారాహి రెండో దశ యాత్ర ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే రెండో దశ యాత్ర ప్రణాళికపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పార్టీ నేతలతో పవన్ చర్చించారు.

అయితే అన్నవరంలో గత నెల 14వ తేదీన మొదటి దశ ప్రారంభమైంది. దాదాపు 10 రోజుల పాటు విజయవంతంగా యాత్రను పూర్తి చేశారు. శనివారం మళ్లీ ఏలూరు సభతో రెండో దశ వారాహి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గ నేతలను పవన్ కళ్యాణ్ కలుస్తారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై వారితో మాట్లాడతారు.

Pawan Kalyan made the final of the second stage of Varahi Yatra<br />

కాగా, తొలి దశ వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్‌ నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ పార్టీ నేతలు ఎవర్నీ వదలకుండా విమర్శలు గుప్పించారు. ఇక, పవన్‌ కళ్యాణ్ కామెంట్లకు అంతేస్థాయిలో అధికార వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. సీఎం జగన్‌ కూడా పవన్‌ కళ్యాణ్ కామెంట్లపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు