BREAKING: సీఎం రేవంత్‌కు పవన్ కళ్యాణ్ మద్దతు!

AP: హైడ్రాపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన హైడ్రా లాంటి దానిని ఏపీలో కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు.

New Update
BREAKING: సీఎం రేవంత్‌కు పవన్ కళ్యాణ్ మద్దతు!

Pawan Kalyan: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన హైడ్రా పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదారాబాద్ లో జరుగుతున్న హైడ్రా అనేది కరెక్ట్, కాకపోతే అసలు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నించారు. పూర్తిగా కట్టేసిన తరవాత కూల్చడం వలన సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.

ఇక్కడ ఎలా పరీవాహక ప్రాంతాలు పరిరక్షించుకోవాలి అనేదానిపై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. తెలంగాణలో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకువస్తే మంచిదే.. కానీ అలా చేస్తే ఇక్కడ చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

భారీ విరాళం...

వరద ప్రభావిత ప్రాంతాలకు మరోసారి భారీ విరాళం ప్రకటించారు పవన్‌. ఇప్పటికే ఏపీ సీఎం సహాయ నిధికి రూ. కోటి ప్రకటించారు. 400 గ్రామ పంచాయితీలు ముంపు బారిన పడ్డాయని అన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ.4 కోట్లు గ్రామ పంచాయతీలకు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు. వైసీపీ నేతలు కూడా జేబుల్లోంచి డబ్బులు విసరండి అని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు