Big Breaking: తెలంగాణలో పోటీకి జనసేన సై.. 32 స్థానాలతో లిస్ట్ రిలీజ్! రానున్న తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు తాము పోటీ చేయబోయే స్థానాల లిస్ట్ ను విడుదల చేశారు. By Nikhil 02 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Janasena Contest 32 Seats in Telangana: ఇన్నాళ్లు ఏపీలోనే ఎక్కువగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సారథ్యంలోని జనసేన పార్టీ (Janasena Party) తాజాగా కీలక ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ (Telangana Elections 2023) పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇదుకు సంబంధించిన స్థానాల వివరాలను ఆ పార్టీ తెలంగాణ నాయకులు ఈ రోజు విడుదల చేశారు. కూకట్ పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనతనగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజుర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర అసెంబ్లీ స్థానాల్లో జనసేన బరిలోకి దగుతుందని నాయకులు ఈ సందర్భంగా ప్రకటించారు. ఇది కూడా చదవండి: Pawan Kalyan ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ ఏం చేశాడంటే..? తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన మీడియా, రాష్ట్ర నాయకులు , జనసైనికులు, వీర మహిళల సమక్షంలో వెల్లడించిన @JanaSenaParty ఉపాధ్యక్షులు శ్రీ బోంగునూరి మహేందర్ రెడ్డి గారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్చార్జి శ్రీ @JSPshankargoud , రాష్ట్ర నాయకులు @itsRamTalluri ,… pic.twitter.com/SZ7LbQ8nzd — 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) October 2, 2023 జనసేన పార్టీ పోటీ చేయనున్న 32 నియోజకవర్గాల వివరాలు.@JanaSenaParty @PawanKalyan#JanaSenaTelangana pic.twitter.com/yGYOwnmIrY — 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) October 2, 2023 ఈ సందర్భంగా జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నదతతో ఉన్నామని స్పష్టం చేశారు. ఈసారి పోటీలో తప్పక జనసేన ఉంటుందన్నారు. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఏమైనా ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చన్నారు. సింగిల్ గా వెళ్లడానికి కూడా తాము సిద్ధమన్నారు. గత 10 సంవత్సరాల్లో అనేక సమస్యలపై తెలంగాణలో జనసేన పార్టీ పోరాటం చేసిందన్నారు. నల్లమల యురేనియం త్రవ్వకాలు, మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్య, RTC కార్మికుల సమస్య, BC, ST వర్గాల సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఇలా అనేక సమస్యలపై పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. #janasena #telangana-election-2023 #pawankalyan #janasena-contest-in-32-seats-in-telangana #janasena-contesting-32-telangana-seats #telangana-janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి