ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

జనసేన పార్టీ పెట్టే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డాం అని పేర్కొన్నారు. జనసేనలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని తెలిపారు.

New Update
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

Pawan Kalyan: జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి (Mangalagiri) కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జనసేన పార్టీలో నాలుగు జిల్లాల ముఖ్య వైసీపీ (YCP) నేతలు చేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి వారిని పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను పార్టీని నడుపలేడు అని చాలామంది ఎద్దేవా చేశారని పేర్కొన్నారు. 2019 నుండి ఇతర పార్టీల నుండి నాయకులను తీసుకుంటే .. ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసే వాళ్లమని అన్నారు. కానీ ఇతర పార్టీల నుండి తాను తమ పార్టీలోకి ఏ నాయకుడిని తీసుకోలేదని తెలిపారు.

ALSO READ: మా అభ్యర్థులతో కేసీఆర్ సంప్రదింపులు.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 నుండే దళిత సంఘాలు, బిసీల నాయకులతో తిరిగినట్లు వెల్లడించారు. వెనుకబడిన వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో కులాల కేటాయించి నిధులు అ కులాలకు వెళ్ళడం లేదని ఆరోపించారు. అధికారం చూడని వారికి అధికారం ఇవ్వడమే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు.

ఒంటరి తనాన్ని అనుభవించి... అవమానాలు పడి.. ఇచ్చిన మాట నెలబెట్టుకోలేనేమో అని అనుక్షణం భయపడ్డాను అని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో జనసేన పార్టీ పెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో రెండు ఎన్నికలు గెలిచిన బీఆర్ఎస్ మూడో ఎన్నికలకు వచ్చేసరికి మారిపోయిందని అన్నారు.

ఈరోజు జనసేనలో చేరిన నాయకులు వీరే..

* చిలకలపూడి పాపారావు సర్పంచి, ఆంధ్రప్రదేశ్ సర్పంచల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు- కృష్ణాజిల్లా వైసీపీ.
* చిక్కాల దొరబాబు- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు.
* దుగ్గన నాగరాజు- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు.
* కలగ పాల్ పురుషోత్తం- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు.
* ఎదురువాక శ్రీ వెంకటగిరి- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు.
* పొగిరి సురేష్ బాబు -శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులు.
* వై శ్రీనివాస్ రాజు - కడప జిల్లా వైసీపీ నాయకులు.

Advertisment
తాజా కథనాలు