ప్రశ్నిస్తే మంచోళ్ళు కాదా? ముద్రగడ పద్మనాభంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బైరెడ్డి సిద్దార్ధరెడ్డి రెచ్చిపోయారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే చెడ్డోడు..లేకపోతే మంచోడా.. దొంగలు.. దోపిడీదారుల అన్న వారిని నువ్వు నమ్ముతున్నావు. ముందు మీరు క్లారిటీలకి రండి తరువాత మేమేంటో చూపించుకుంటాం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చేది సీఎం జగనే. By Vijaya Nimma 24 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి గతంలోకి వెళ్లి చూసుకో ఏమన్నావో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధరెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తే ముద్రగడ్డ పద్మనాభం చెడ్డోడా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు దొంగ, దోపిడీదారుడు అన్న పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు నీకు దేవుడు అయ్యారా అన్నారు. పవన్ నీవు ఒక మాట మీద నిలబడు.. ఒకసారి చంద్రబాబు చెడ్డోడు.. ఒకసారి మంచోడు ఎలా కనిపిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. చంద్రబాబు కుప్పంలో.. లోకేష్ మంగళగిరిలో నిలబడతారో లేదో క్లారిటీ లేదు. అలాంటి వాళ్లను నువ్వు నమ్ముకున్నావని ఎద్దేవా చేశారు. కనీసం నువ్వైనా నిలబడతావో లేదో నీకైనా క్లారిటీ ఉందా అన్నారు. ముందు వాళ్ళు క్లారిటీకి వచ్చాక మేము గెలిచే విషయం చెపుతామంటూ పవన్ పై విరుచుకు పడ్డారు. ఓడిపోయే చరిత్ర రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడని వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధరెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో జగనన్న ప్రవేశ పెట్టిన మానిఫెస్టోను కాపీ కొట్టి చంద్రబాబు మినీ మానిఫెస్టో రిలీజ్ చేశాడు. చంద్రబాబు చచ్చి గీపెట్టినా ప్రజలు నమ్మరని సిద్దార్ధరెడ్డి అన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా అయినా నిలుపుకునేందుకే చంద్రబాబు పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. హత్యారాజకీయాలను పెంచి పోషించింది చంద్రబాబేనని.. రానున్న ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ది చెబుతారని బైరెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి