/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-84.jpg)
Pawan Kalyan Gives Clarity About His Movies : సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాలను పక్కనపెట్టి ప్రెజెంట్ పూర్తిగా రాజకీయాలతోనే బిజీ అయిపోయాడు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి అధికారులతో వరుస సమీక్షలు చేస్తూనే.. మరోవైపు జనాలతో మమేకమవుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ ఇప్పటికే కమిటైన సినిమాలను పూర్తి చేస్తాడా? అనే డైలమాలో ఫ్యాన్స్ ఉండగా.. దీనిపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చాడు.
మూడు నెలలు నో షూటింగ్..
పిఠాపురం వారాహి సభలో పవన్ కల్యాణ్ తన సినిమాలకు సంబంధించి ప్లాన్ ఎలా ఉండబోతుందో చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుంటే మధ్యలో అందరూ ఓజీ.. ఓజీ అంటూ అరవడం మొదలుపెట్టారు. అయితే జనాలు ఏమంటున్నారో అర్థం కాకపోవడంతో పక్కనే ఉన్న వారిని అడిగి తెలుసుకున్న పవన్.. తనదైన స్టైల్‌లో ఫన్నీగా ఓజీ సినిమానా..? అని అడిగాడు.ఆ వెంటనే జనాలంతా కేరింతలు కొట్టారు.
Also Read : ‘దేవర’ సెకండ్ సింగిల్ అప్డేట్.. ఈసారి అదిరిపోయే మెలోడీతో!
ప్రస్తుతం సినిమాలు తీసే సమయం ఉందా..? మీకు మాటిచ్చాను కాబట్టి మూడు నెలలు సినిమా షూటింగ్స్ పెట్టుకోను. ఆంధ్రాలో రోడ్డు వేసిన తర్వాత.. గుంతలు పూడ్చిన తర్వాత షూటింగ్స్‌కు వెళ్తాను. కుదిరినప్పుడల్లా 2,3 రోజులు షూటింగ్‌కు వెళ్తా. నిర్మాతలకు కూడా క్షమాపణలు చెప్పా అని అన్నారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే పవన్ షూటింగ్ లో జాయిన్ అవ్వాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే. ఈ విషయంలో ఆయన ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.