/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-modi-1.jpg)
Modi With Mega Brother : అన్నకళ్ళలో కన్నీరు.. వదిన మోములో పుత్రోత్సాహం.. అన్నకొడుకు భావోద్వేగం.. భార్య కళ్ళలో ప్రపంచాన్ని జయించినంత ఆనందం.. కొడుకులో ఉప్పొంగిన ఉత్సాహం.. ప్రజల కేరింతల్లో వెలకట్టలేని అభిమానం.. ఇది కదా విజయం అంటే.. ఇదే కదా విజయోత్సాహం అంటే. అవును.. “పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనే నేను” ఈ మాట పలకడం కోసం ఎన్నో ఏళ్ల నిరీక్షణ. అవమానాలను తట్టుకున్న సహనం.. అన్నిటినీ మించి ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన విజ్ఞత.. ఇది తెచ్చిన ఘన విజయం. పవన్ కళ్యాణ్ సాధించింది మామూలు విజయం కాదు.
Pawan Kalyan Family : ఏపీ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడటానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), సురేఖ, రామ్ చరణ్ (Ram Charan), కొడుకు అకీరా నందన్, భార్య అన్నా లెజినోవా విజయవాడ దగ్గర కేసరపల్లిలో జరిగిన అద్భుతమైన వేదిక వద్దకు వచ్చారు. వేదిక మీద చిరంజీవి అనుక్షణం పవన్ కళ్యాణ్ ను చూసి మురిసిపోతుంటే, వేదిక కింద నుంచి చూస్తున్న మిగిలిన వారు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్నపుడు తమ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు.. అందరి మోముల్లో పవన్ పట్ల వారికున్న వాత్సల్యం.. ఇలా ఒక్కటి కాదు రకరకాల ఎమోషన్స్ అక్కడ కనిపించాయి.
ప్రధాని మోదీ అదిరిపోయే లాస్ట్ పంచ్!
ఇవన్నీ ఒక ఎత్తైతే, ప్రధాని మోదీ (PM Modi) చేసిన పని మరో ఎత్తుగా నిలిచింది. పవన్ కళ్యాణ్, చిరంజీవిలను ఆకాశానికి ఎత్తేసింది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి అయిన వెంటనే ప్రధాని మోదీ.. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దర్నీ చెరో చేత్తో పట్టుకుని వేదిక మధ్యకు తీసుకు వచ్చారు. వారిద్దరినీ ఆలింగనం చేసుకుని ఇద్దరి చేతులు పైకెత్తి విక్టరీ సింబల్ చూపించారు. దీంతో చిరంజీవి భావోద్వేగంతో తమ్ముడు పవన్ కళ్యాణ్ బుగ్గలు నిమురుతూ సంబర పడిపోయారు. ఈ సన్నివేశాన్ని చూసిన వారంతా.. ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ప్రాధాన్యం చూసి ఆశ్చర్యపోయారు.
మెగా ఫ్యామిలీకి ఎమోషనల్ మూమెంట్@KChiruTweets @PawanKalyan @narendramodi #NaraChandrababuNaidu #AndhraPradesh #RTV pic.twitter.com/aa6SWm49B9
— RTV (@RTVnewsnetwork) June 12, 2024
Also Read : ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం