Pawan Kalyan : కంపెనీల్లో ప్రాణాలకు విలువ లేని పరిస్థితి.. పవన్ కళ్యాణ్ ఆవేదన!
అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో గత ప్రభుత్వం భద్రతా చర్యలను విస్మరించడమే ఇందుకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు
Pawan Kalyan Comments On Visakha Pharma Company Incident :అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ (Atchutapuram Chemical Factory) ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ (AP) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడడం చాలా దురదృష్టకరమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో గత ప్రభుత్వం భద్రతా చర్యలను విస్మరించడమే ఇందుకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
VIDEO | "Sometimes development comes with a lot of dangers, issues. Everyone says that Andhra is having a great coastline, great industries, development is needed, but how much safety concerns are being addressed is a bigger issue. We need employment, but it is quite risky for… pic.twitter.com/QGi5aUaJ68
ఫార్మా కంపెనీ యాజమాన్యంలో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కెమికల్ కంపెనీల్లో భద్రతకు సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కంపెనీల్లో ప్రమాదాలు సాధారణమైపోయాయని, ప్రాణాలకు విలువ లేని పరిస్థితి ఏర్పడిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదాలకు త్వరలోనే అడ్డుకట్ట వేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కంపెనీలకు, కార్మికులకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు (Chandrababu), మృతుల కుటుంబాలకు కోటి రూపాయల సాయం ప్రకటించారని తెలిపారు.
Pawan Kalyan : కంపెనీల్లో ప్రాణాలకు విలువ లేని పరిస్థితి.. పవన్ కళ్యాణ్ ఆవేదన!
అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో గత ప్రభుత్వం భద్రతా చర్యలను విస్మరించడమే ఇందుకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు
Pawan Kalyan Comments On Visakha Pharma Company Incident : అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ (Atchutapuram Chemical Factory) ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ (AP) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడడం చాలా దురదృష్టకరమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో గత ప్రభుత్వం భద్రతా చర్యలను విస్మరించడమే ఇందుకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: ఫార్మా కంపెనీలో 2019-24 మధ్య 119 ప్రమాదాలు.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!
ఫార్మా కంపెనీ యాజమాన్యంలో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కెమికల్ కంపెనీల్లో భద్రతకు సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కంపెనీల్లో ప్రమాదాలు సాధారణమైపోయాయని, ప్రాణాలకు విలువ లేని పరిస్థితి ఏర్పడిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: కన్నీరు పెట్టిస్తోన్న హారిక కథ.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి..!