AP: సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలి: పవన్

సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించారు. నేడు ఆయన రూరల్‌ డెవలప్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. పిఠాపురంలోని తన కార్యాలయం నుంచే SLRMను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు.

AP:  సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలి: పవన్
New Update

Pawan Kalyan: సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించారు. నేడు ఆయన రూరల్‌ డెవలప్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. పిఠాపురంలోని తన కార్యాలయం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. నదులకి, సాంప్రదాయాలకి విలువ నిచ్చే దేశంలో మనం ఉన్నామని.. అయితే, ప్లాస్టిక్, చెత్త చెదారం అంతా నదుల్లో కొట్టుపోతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు.  ఈ కారణంగా పంట పొలాలు సైతం నష్ట పోతున్నాయన్నారు.

Also Read: నందికొట్కూరులో ఉద్రిక్తత.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..!

ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ నుంచి చెత్తని సేకరించి సంపద సృష్టిస్తామన్నారు. ముందుగా పిఠాపురంలో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామని వెల్లడించారు. ప్రజల నుంచి సహాయ సహకారాలు ఉంటే మంచిదన్నారు. 50 నుంచి 70 మంది మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పై అందరికి అవగాహనా తీసుకొస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే డబ్బుని కార్మికులకు జీతాలు ఇస్తామన్నారు.

Also Read: లావణ్య డెడ్ బాడీని మాయం చేస్తా.. మాల్వీ మల్హోత్రా సంచలన వార్నింగ్?

పంచాయతీలకి నిధుల కోసం పంచాయతీల్లో రొడ్డ ప్రక్కన కొబ్బరి చెట్లని పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకుంటామన్నారు. NRI 's ని సైతం ఇలాంటి ప్రాజెక్ట్ లో ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తామన్నారు. సర్వీస్ చేయాలంటే ఎవరు ముందుకు రారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ నుంచి డబ్బు వస్తుందంటే రావచ్చన్నారు. నిధులు పక్క దారి పడుతున్నాయని అడుగుతుంటే అందరు ఒక ఐఏఎస్ అధికారిపై వేలు చూపిస్తున్నారని.. అయితే ఆయన ఇప్పుడు సర్వీసులో లేరుని కామెంట్స్ చేశారు.

#pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe