ముందు రాష్ట్ర చూడు
జగన్‌కి అసహనం పెరిగిపోయిందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటానికి సిగ్గు ఉండాలన్నారు. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని జగన్ అంటున్నారని.. నాలుగో అమ్మాయి ఏమైనా ఆయన బంధువాని ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబుని కాల్చి చంపాలని అన్నారని.. అంటే సీఎం ఏదైనా మాట్లాడవచ్చా? అని తాతారావు ప్రశ్నించారు. పవన్ ప్యాకేజీ స్టార్ కాదన్నారు.
జగన్‌కి ఓటమి భయం
గంగవరం పోర్ట్ యాజమాన్యం దగ్గర మీరు ఎంత తీసుకున్నారో చెప్పాలని జగన్‌ను తాతారావు నిలదీశారు. జగన్‌కు సరిగా తెలుగు కూడా రాదని వారాహికి బదులు.. వరాహి అంటున్నావని ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయ్యాక ఏపీ గంజాయికి అడ్డాగా మారిందని విమర్శించారు. క్రైంలో దేశంలోనే 6వ స్థానానికి ఏపీని తీసుకెళ్లారన్నారు. 175 గెలుస్తానని అంటున్న జగన్.. పవన్ వారాహి చేస్తే తట్టుకోలేక పోతున్నాడన్నారు. జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. పవన్ పెళ్లిళ్ల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం లేదన్నారు. పరిపాలన చేతకాక జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అని తాతారావు పేర్కొన్నారు.