Pavan Kalyan: జగన్ కు భయాన్ని పరిచయం చేసింది జనసేన.. పవన్ సంచలన వ్యాఖ్యలు

జగన్ ను భయపెట్టింది జనసేన పార్టీ అని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో బహిరంగ సభలో పవన్ తాను పదేళ్ల నుంచి ధర్మ పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఏపీ దశ దిశ పిఠాపురం నుంచే మొదలవుతుందన్నారు. పవన్ ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడండి. 

Pavan Kalyan: జగన్ కు భయాన్ని పరిచయం చేసింది జనసేన.. పవన్ సంచలన వ్యాఖ్యలు
New Update

Pavan Kalyan: ‘‘ఈరోజు జగన్ భయపడుతున్నాడు.. జగన్ ను జనసేన పార్టీ భయపెట్టింది.. ఈరోజు రోడ్డుపైకి వెళ్లేందుకు,  మాట్లాడేందుకు జగన్ భయపడుతున్నాడు.. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం.. మన హక్కులను అణచివేయాలనుకున్నాడు.. మమ్మల్ని భయపెట్టాలనుకున్నాడు. అలాంటి జగన్ ను జనసేన పార్టీ భయపెడుతోంది.”  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం పిఠాపురంలో భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అన్న మాటలివి. వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ.. తాను గత పదేళ్ల నుంచి ధర్మ పోరాటం చేస్తున్నానని వెల్లడించారు. తనను తిట్టారని, తన భార్య, పిల్లలు కూడా తిట్టారని, అవమానించారని, అయితే ప్రజల కోసమే తాను అన్నింటినీ భరించానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Also Read: ఈరోజు మాత్రమే.. తరువాత అంతా సైలెన్స్

Pavan Kalyan: ఒక వీర వనిత, ఒక ప్రజా సైనికురాలు, సుగాలీ ప్రీతి తల్లి, భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను నాతో చెప్పగా, వారి తరఫున వారిని ప్రశ్నించి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీ భయపెట్టాను. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... అదే జనసేన పార్టీ బలం అంటూ ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించారు.  దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఏళ్ల తరబడి నిలిచి పోరాడలేదు. ఇది నా గొప్పతనం అని అనుకోను... నన్ను గుండెల్లో పెట్టుకున్న మహిళలు, సైనికుల పోరాట పటిమతో ఈ ప్రస్థానం కొనసాగించాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

Pavan Kalyan: ఏపీ దశ దిశ మార్చేందుకే పిఠాపురం వచ్చానన్న పవన్ ఇక్కడి నుంచే ఏపీ భవితలో మార్పు మొదలవుతుందని చెప్పారు. దేశం గర్వించేలా పిఠాపురం నుంచి మార్పుకు శ్రీకారం చుడుతున్నామని ప్రకటించిన పవన్..  నేను ప్రజల కోసం, యువత కోసం పనిచేస్తున్నాను. ఒక తరం కోసం పోరాడుతూ, రెండు తరాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నానంటూ వివరించారు. మొన్న సాయిధరమ్ తేజ్ పిఠాపురం చేరుకోగానే వైసీపీ గూండాలు గాజు సీసాతో దాడికి యత్నించారు. తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త గాయపడ్డారు. ఇలాంటి దాడులు చేసే పార్టీ వైసీపీ...కానీ ఈ దేశం కోసం ప్రాణం పోసే పార్టీ జనసేన. ఈ గాజు సీసా దాడులు మనల్ని భయపెట్టలేవు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 

ఈ ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా ఓటు మాత్రం జనసేనకే కావాలి... గాజు గుర్తుపైనే ఓటు వేయాలి గాజు గుర్తుకు ఓటేద్దాం’’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

#pavan-kalyan #election-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe